కరోనా మహమ్మారి రెండోసారి దేశం మొత్తాన్ని లక్షలసంఖ్యలో కేసులతో కుదిపేస్తుంది. మొదటిసారి కంటే కూడా ఈసారి వైరస్ ఎఫెక్ట్ ప్రభావవంతంగా ఉంది. అందుకే లక్షల్లో కేసులు, వందల్లో మరణాలు నమోదు అవుతున్నాయి. ఇలాంటి సమయంలో తెలిసి తెలిసి ఏ ఒక్కరూ కూడా రిస్క్ తీసుకునేందుకు సిద్ధపడరు. ప్రస్తుతం అలాంటి నిర్ణయం తీసుకున్న ఓ ప్రముఖ యాక్టర్ వలన సినిమా షూటింగ్ నిలిచిపోయే దశలో ఉందట. ఆ యాక్టర్ ఎవరో కాదు.. టాలీవుడ్ సీనియర్ హీరో జగపతిబాబు. జేబీ సౌత్ ఇండస్ట్రీలోని మోస్ట్ బిజీస్ట్ ఆర్టిస్టులలో ఒకరు. ఎలాంటి భాషాబేధం లేకుండా తనకు నచ్చిన ప్రతి సినిమా చేసుకుంటూ వెళ్తున్నాడు. ప్రస్తుతం జగ్గుభాయ్ చేతినిండా సినిమాలు ఉన్నాయి.
కానీ తాజాగా జేబీ.. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో బయట తిరగటం చాలా రిస్క్. అలాగే ఈ కరోనా ప్రభావం తగ్గేవరకు తాను సినిమా షూటింగ్ లలో పాల్గొనకూడదని నిర్ణయంచుకున్నట్లు తెలిపాడు. ఏ సినిమా విషయంలో అంటే.. ప్రస్తుతం జేబీ డైరెక్టర్ అజయ్ భూపతి రూపొందిస్తున్న సెకండ్ మూవీ 'మహాసముద్రం'లో నటిస్తున్నాడు. ఆ సినిమా షెడ్యూల్ ఇప్పుడు వైజాగ్ లో జరుగుతుంది. ఆశ్చర్యకరంగా జగపతిబాబు ఆ సినిమా షూటింగ్ కు.. ప్రస్తుత డేంజర్ పరిస్థితులలో రాలేనని ఓవైపు కరోనా కేసులు పెరుగుతున్నాయని చెప్పాడట. అసలే 60 సంవత్సరాల వయసు పైబడిన వారికీ కరోనా త్వరగా సోకుతుంది. మరి ఆల్రెడీ జగ్గుభాయ్ 60 దాటేసారు. అందుకే ఈ విషయంలో ఖచ్చితంగా బ్రేక్ తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. చూడాలి మరి మహాసముద్రం బృందం ఏమంటారో!