అభిమాని మృతిపై స్పందించిన స్టార్‌ హీరోయిన్‌

Update: 2021-11-15 14:30 GMT
సినిమా తారలను ఎంతగానో అభిమానించే వారు ఉంటారు. వారి కోసం ప్రాణాలు తీసుకోవడం మొదలుకుని ప్రాణాలు తీయడం వరకు కూడా సిద్దం అవుతారు. అలాంటి అభిమానులను కొందరు మాత్రమే కలిగి ఉంటారు. ఎంతో మంది అభిమానులు ఉన్నా కూడా కొందరు మాత్రం ప్రత్యేకంగా ఉంటారు. అభిమానులు ఎంతగానో అభిమానిస్తే వారిని స్టార్స్ కూడా తిరిగి అభిమానించడం చేస్తూ ఉంటారు.

కొందరు అభిమానులను ప్రత్యేకంగా గుర్తు పెట్టుకుని మరీ ప్రత్యేక సందర్బాల్లో వారితో మాట్లాడటం కూడా చేస్తూ ఉంటారు. అలా సౌత్‌ స్టార్ సీనియర్ హీరోయిన్‌ త్రిషకు కొందరు అత్యంత ఆప్తులు అయిన అభిమానులు కొందరు ఉంటారు. అందులో కిషోర్‌ అనే అభిమాని ఒకరు ఉన్నారు.

ఇటీవల కిషోర్‌ అనారోగ్య కారణంతో మృతి చెందాడు. ఆయన మృతి విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా తెలుసుకున్న త్రిష స్పందించింది. త్రిష ఫ్యాన్‌ పేజీలో కిషోర్‌ మృతి గురించి తెలియసేస్త అతడికి శ్రద్దాంజలి ఘటిస్తున్నట్లుగా పేర్కొన్నారు.

ఆ ట్వీట్ కు స్పందిస్తూ.. ఈ వార్త చూసిన తర్వాత నా గుండె బద్దలయ్యింది. నీ ఆత్మకు శాంతి కలగాలి సోదర.. ఇన్నాళ్లు నాకు వెన్నంటి ఉన్నందుకు కృతజ్ఞతలు అంటూ త్రిష ట్వీట్‌ చేసింది. త్రిష ట్వీట్‌ కు అభిమానులు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. అభిమాని మృతికి స్పందించి ట్వీట్‌ చేయడం నిజంగా అభినందనీయం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు కూడా అంటున్నారు.

త్రిష సినిమాల విషయానికి వస్తే ఈమద్య కాలంలో ఈమె కేవలం లేడీ ఓరియంటెడ్‌ చిత్రాలను మాత్రమే చేస్తూ ఉంది. తెలుగు లో ఈమె సినిమా చేయక చాలా రోజులు అయ్యింది. అయితే ఈమె నటించిన తమిళ సినిమాలు తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.

తెలుగు లో ఇటీవలే ఒక సినిమా కమిట్ అయ్యిందనే వార్తలు వచ్చాయి. తెలుగు మరియు తమిళంలో ఒక ద్వి భాష సినిమాను కూడా ఇటీవలే ఈమె ప్రకటించింది. ఇక ఇండియన్ 2 నుండి కాజల్ తప్పుకోవడంతో ఈమె ను ఎంపిక చేశారనే పుకార్లు కూడా వస్తున్నాయి. మొత్తానికి ఇండస్ట్రీలో అడుగు పెట్టి రెండు దశాబ్దాలు అవ్వబోతున్నా కూడా వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూనే ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.


Tags:    

Similar News