ఎఫ్-2తో బాక్సాఫీస్ వద్ద అనిల్ రావిపూడి టీమ్ ఓ రేంజ్ లో రచ్చ చేసింది. దాన్ని కంటిన్యూ చేస్తూ.. ఎఫ్-3 అంటూ రాబోతోంది. అయితే.. ఎఫ్-3 అనగానే మూడో హీరో ఉండబోతున్నాడనే ప్రచారం సాగింది. పలానా హీరోను తీసుకోబోతున్నారని పేర్లు కూడా చక్కర్లు కొట్టాయి. అయితే.. అదంతా ఏమీ లేదని, మూడో హీరో ఆలోచనే తనకు రాలేదని క్లారిటీ ఇచ్చాడు దర్శకుడు.
అయితే.. ఎఫ్-3లో మూడో హీరోకు అవకాశం ఇవ్వలేదుగానీ.. మూడో హీరోయిన్ కు మాత్రం స్పేస్ క్రియేట్ చేశాడు అనిల్. ఎఫ్-2లో నటించిన వెంకటేష్, వరుణ్, తమన్నా, మెహ్రీన్ పాత్రలను యధావిధిగా కంటిన్యూ చేస్తూ.. మూడో బ్యూటీని కూడా రంగంలోకి దించాడట.
ఈ క్యారెక్టర్ కు బాలీవుడ్ బ్యూటీ సోనాల్ చౌహాన్ ను తీసుకున్నారని తెలుస్తోంది. గతంలో బాలయ్య సరసన డిక్టేటర్, రూలర్ వంటి చిత్రాల్లో నటించిందీ బ్యూటీ. అయితే.. ఆ తర్వాత తెలుగులో సరైన అవకాశాలు రాకపోవడంతో తిరిగి ముంబై ఫ్లైట్ ఎక్కేసింది.
తాజాగా.. అనిల్ రావిపూడి నుంచి కాల్ వచ్చిందని ప్రచారం జరుగుతోంది. పాత్ర నిడివి, వగైరా ఏంటనేది తెలియదుగానీ.. మొత్తానికైతే సోనాల్ ను ఫైనల్ చేశారని అంటున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవీశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.