త‌స్మాత్ జాగ్ర‌త్త‌! మ‌ళ్లీ మ‌ళ్లీ ఇల్లీ వైర‌స్ ఎటాక్ చేస్తుంది!!

Update: 2022-02-05 06:30 GMT
త‌స్మాత్ జాగ్ర‌త్త‌! మ‌ళ్లీ మ‌ళ్లీ ఇల్లీ వైర‌స్ ఎటాక్ చేస్తుంది!!  గోవా బ్యూటీ ఇలియానా లేటెస్ట్ బికినీ షూట్ వీక్షించాక అభిమానుల  అభిప్రాయ‌మిదీ. గ‌డిచిన కొంత‌కాలంగా ఇలియానా వ‌రుస ఫోటోషూట్లు కుర్ర‌కారులో ఇలాంటి అభిప్రాయాన్ని క‌లిగిస్తున్నాయి. అందాల ఇలియానా నిరంత‌రం హాట్ కంటెంట్ తో వెబ్ ని షేక్ చేస్తోంది. ఒక ర‌కంగా వైర‌స్ లా చుట్టేస్తోంది అంటే అతిశ‌యోక్తి కాదు.

ఇంత‌కుముందు ఆస్ట్రేలియ‌న్ ప్రియుడు ఆండ్రూ నీబోన్ తో క‌ల‌త‌లు రావ‌డం.. అటుపై అత‌డికి బ్రేకప్ చెప్పేయ‌డం తెలిసిన‌దే. ఆ త‌ర్వాత ఇల్లీ డీప్ డిప్రెష‌న్ లోకి వెళ్లి 100 కేజీలు పైగా వెయిట్ పెరిగింది. కానీ తిరిగి లైఫ్ లో రియ‌లైజ్ అయ్యాక బ‌రువు త‌గ్గాల్సొచ్చింది. దీనికోసం నిరంత‌రం జిమ్ముల్లో క‌స‌ర‌త్తులు చేస్తూ అధిక కొవ్వును కంట్రోల్ చేసే ప్ర‌య‌త్నం చేసింది. ఇటీవ‌ల‌ పూర్తిగా స్లిమ్ అయిన ఫోటోల‌ను షేర్ చేయ‌గా అవి అంత‌ర్జాలంలో వైర‌ల్ అయ్యాయి. జీరో డిగ్రీల నుంచి 90 డిగ్రీలు 180 డిగ్రీల కోణంలో ఇలియానా ర‌క‌ర‌కాల భంగిమ‌లు కుర్రాకారు గుండెల్ని తాకాయి. దీనిపై మీడియా క‌థ‌నాలు వేడెక్కించాయి.

తాజాగా మ‌రోసారి రెడ్ హాట్ బికినీలో ఇలియానా ఫోజ్ చెమ‌ట‌లు ప‌ట్టించేస్తోంది. సోష‌ల్ మీడియాల్లో ఈ ఫోటోగ్రాఫ్‌ ట్రెండింగ్ గా మారింది. అయితే ఇటీవ‌ల స్లిమ్ రూపం మ‌ళ్లీ మాయ‌మైంది. బాగా బొద్దుగా క‌నిపిస్తోంది. రెడ్ టూపీస్ త‌న‌కు బాగానే యాప్ట్ అయినా కానీ ఈ బొద్దుత‌నంపై మ‌రోసారి ట్రోల్స్ ఎదుర్కోవాల్సి వ‌స్తోంది.

ఆ స‌న్న‌జాజి న‌డుము మిస్సింగ్?

నిజానికి ఇలియానాలో ఫ్యాన్స్ కి న‌చ్చేదే ఆ స‌న్న‌జాజి న‌డుము. కానీ అది ఇటీవ‌ల మిస్స‌య్యింది. అధిక బ‌రువు అనేది స‌మ‌స్య‌గా మారిన‌ట్టే క‌నిపిస్తోంది.  ఫ్యాన్స్ క‌ళ్ల‌కు ఇల్లీ అందంగా క‌నిపించినా కానీ ఇంకేదో తేడా కొడుతోంద‌న్న కామెంట్లు వినిపిస్తున్నాయి. నిజానికి విలాసాల స‌రాగాల ఇల్లీ తాను కోరుకున్న‌ ఫ్యాషన్ పోకడలతో మైండ్ బ్లాక్ చేయ‌గ‌ల‌దు. కానీ లుక్ ప‌రంగా మ‌రింత‌ జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాలి అంటూ సూచిస్తున్నారు. ఇలియానా ఎరుపు రంగు బికినీలో రఫ్ఫ్డ్ స్లీవ్‌లు హై-వెస్ట్ బాటమ్ లతో మెరిపించింది. టూ పీస్ లో ఆమె చాలా అందంగా కనిపిస్తోంది. సన్నగా ఉన్న నడుము మాయ‌మై.. ఆ థై సొగ‌సులు వేడెక్కిస్తున్నాయి.

అయితే సోషల్ మీడియా లో కొన్ని ప్ర‌మాణాల ప్ర‌కారం.. అందాన్ని కొలిచేందుకు యూత్ ప్ర‌య‌త్నిస్తోంది. ఇక‌పోతే ఇల్లీ ఇంతకుముందు తన బరువు సమస్యల గురించి చాలాసార్లు మాట్లాడింది. కానీ ఫోటోషూట్ల‌లో ఎక్క‌డా త‌గ్గేదేలే అంటూ హెవీగా క‌నిపిస్తోంది. అయితే ఇలియానా ఒక సంగ‌తిని ప్ర‌స్థావిస్తూ.. సోష‌ల్ మీడియా యాప్ ల‌లో అభిమానులు మార్ఫింగ్ ఫోటోల‌ను షేర్ చేస్తున్నార‌ని ఒరిజిన‌ల్ గా త‌న రూప‌లావ‌ణ్యం ఒంపుసొంపులు ఎంతో ఆక‌ర్షిస్తాయ‌ని కూడా చెప్పింది. ఇక కెరీర్ మ్యాట‌ర్ కి వస్తే.. ఇటీవ‌ల ఇలియానాకు స‌రైన ఆఫ‌ర్లు లేవు. తీరిక స‌మ‌యాల్లో ఇలా ఫోటోషూట్ల‌తో టైమ్ స్పెండ్ చేస్తోంది.
Tags:    

Similar News