సింగర్ శ్రావణ భార్గవి ఇటీవల కాలంలో వివాదాస్పదమవుతూ వస్తున్నారు. మొదట తన భర్త, ప్రముఖ గాయకుడు హేమచంద్రతో విడిపోతున్నారని శ్రావణ భార్గవిపై కథనాలు వచ్చాయి.
ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట మధ్య విభేదాలు తీవ్రమయ్యాయని.. విడాకులు తీసుకుంటున్నారని వార్తలు హల్‌చల్ చేశాయి. అది కాస్త సద్దుమణిగిందిలే అనుకునేలోపే అన్నమయ్య కీర్తన ఒక పరిని ఆమె కాళ్లూపుకుంటూ పాడారని, అసభ్యంగా పడుకుని ఆలపించారని.. పైగా దాన్ని తన యూట్యూబ్ చానల్ లో పోస్టు చేశారని ఇలా ఆమెపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి.
తిరుపతి వాసులు, ప్రముఖ సంకీర్తనాచార్యుడు అన్నమయ్య వంశస్తులే కాకుండా శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తులు.. శ్రావణ భార్గవిపై నిప్పులు చెరిగారు. ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అంతేకాకుండా ఆమె తిరుపతి వస్తే అడ్డుకుంటామన్నారు. ఆమె చేసిన భేషరతుగా క్షమాపణ చెప్పాలన్నారు. దీంతో దిగివచ్చిన శ్రావణ భార్గవి ఆ వీడియోను డిలీట్ చేసిన సంగతి తెలిసిందే.
కేవలం మ్యూజిక్ తోనే ఆ వీడియోను యూట్యూబ్ లో ఉంచారు. ఇదిలా ఉంటే సింగర్ శ్రావణ భార్గవి వివాదంపై సీరియస్‌గా రియాక్టయ్యారు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. అన్నమాచార్యుల రచనలను కీర్తనలను ఎవరైనా అపహాస్యం చేస్తే మహాపాప౦ చుట్టుకుంటుందన్నారు.
అన్నమయ్య సంకీర్తనలను దుర్వినియోగం చేస్తే చర్యలు తప్పవని వైవీ సుబ్బారెడ్డి హెచ్చరించారు. అలాంటి పనులు ఎవరు చేసినా చట్టపరంగా టీటీడీ చర్యలు తీసుకుంటుందన్నారు. అన్నమయ్య కీర్తనలకు, రచనలకు తమ ప్రభుత్వం విశిష్ట ప్రాధాన్యత ఇస్తోందన్నారు. అందుకే అన్నమయ్య నడియాడిన ప్రాంతానికి ఆయన పేరుతో జిల్లా ఏర్పాటు చేశామన్నారు.
వైవీ సుబ్బారెడ్డి చర్యలు తీసుకుంటామని చెబుతుండటంతో మరి గాయని శ్రావణ భార్గవి ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే. అలాగే ఆమెపై టీటీడీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఆమెకు తోటి సింగర్స్ నుంచి ఎలాంటి మద్దతు లభించడం లేదు