'వార‌సుడు' వివాదం..సీన్ లోకి త‌మిళ ప్రొడ్యూస‌ర్స్!

Update: 2022-11-19 14:30 GMT
త‌మిళ స్టార్ హీరో ద‌ళ‌ప‌తి విజ‌య్ న‌టిస్తున్న లేటెస్ట్ మూవీ 'వార‌సుడు'. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ మూవీని స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు త‌న సోద‌రుడు శిరీష్ తో క‌లిసి అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్నాడు. త‌మిళంలో 'వారీసు'గా రూపొందుతున్న ఈ మూవీని తెలుగులో 'వార‌సుడు'గా రిలీజ్ చేస్తున్నారు. నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ మూవీని ఈ సంక్రాంతికి త‌మిళ, తెలుగు భాష‌ల్లో ఏక కాలంలో రిలీజ్ చేస్తున్నారు.

ఇదే సంక్రాంతికి తెలుగు సినిమాలు విడుద‌ల‌వుతున్నాయి. చిరంజీవి న‌టిస్తున్న 'వాల్తేరు వీర‌య్య‌', నంద‌మూరి బాల‌కృష్ణ న‌టిస్తున్న 'వీర సింహారెడ్డి' విడుద‌ల‌వుతున్నాయి. వీటికి 'వార‌సుడు' డ‌బ్బింగ్ మూవీ కార‌ణంగా థియేట‌ర్లు అనుకున్న స్థాయిలో ల‌భించ‌డం లేద‌నే వాద‌న వినిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో నిర్మాత‌ల మండ‌లి తాజాగా ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. పండ‌గ సీజ‌న్ లో తెలుగు సినిమాల‌కే ప్ర‌ధాన్య‌త నివ్వాల‌ని ప్ర‌క‌టించారు.

దీంతో వివాదం కాస్త మ‌రింత‌గా ముదిరి రెండు రాష్ట్రాల మ‌ధ్య చిచ్చు పెట్టేలా మారింది. తెలుగు నిర్మాత‌ల ప్ర‌క‌ట‌న‌ని సీరియ‌స్ గా తీసుకున్న త‌మిళ నిర్మాత‌లు తాజాగా ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. 2017లో ఇద్ద‌రు నిర్మాత‌ల మ‌ధ్య స్ట్రెయిట్, డ‌బ్బింగ్ సినిమాల కార‌ణంగా ఏర్ప‌డిన వివాదం కార‌ణంగా తెలుగు నిర్మాత‌ల సంగం పండ‌గ సీజ‌న్ లో తెలుగు సినిమాల‌కే ప్ర‌ధాన్యం ఇవ్వాల‌ని ప్ర‌క‌టించింది. ఇప్ప‌డు కూడా అదే విధానాన్ని పాటించాలంది.

దీనిపై ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేశారు. తెలుగు సినిమాలు త‌మిళ‌నాడులో ఎలాంటి ఆటంకాలు లేకుండా విడుద‌ల‌వుతున్న‌ప్పుడు తెలుగు రాష్ట్రాల్లో త‌మిళ సినిమాల‌కు అడ్డంకులు సృష్టించ‌డం బాగాలేద‌ని, అలా చేస్తే త‌మిళ‌నాడులో తెలుగు సినిమాల‌ని అడ్డుకుంటామ‌ని తీవ్రంగా హెచ్చ‌రించ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. తాజా వివాదంపై త‌మిళ నిర్మాత‌లు స‌మావేశం కానున్న‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి.

విజ‌య్ 'వార‌సుడు' విష‌యంలో జరుగుతున్న ప‌రిణామాల్ని సీరియ‌స్ గా తీసుకున్న త‌మిళ నిర్మాత‌లు న‌వంబ‌ర్ 22న ప్ర‌త్యేకంగా స‌మావేశం కానున్న‌ట్టుగా తెలుస్తోంది. తాజాగా ఈ వివాదంపై స్టార్ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ కూడా స్పందించిన విష‌యం తెలిసిందే. ఇంత జ‌రుగుతున్నా ఈ వివాదంపై దిల్ రాజు మాత్రం నోరు మెద‌ప‌డం లేత‌నే కామెంట్ లు వినిపిస్తున్నాయి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News