మారుతిని ఇబ్బంది పెడుతోన్న హీరో!

Update: 2022-11-12 02:30 GMT
ఇండస్ర్టీలో స్టార్ హీరోల‌కు ద‌ర్శ‌కులు గేలం  వేయడం స‌హ‌జం. ఒక్క చాన్స్ వ‌చ్చి హిట్ కొడితే  ఆ ద‌ర్శ‌కుడి రేంజే మారిపోతుంది. స్టార్ మేక‌ర్స్ జాబితాలో చేరిపోతాడు. అక్క‌డి నుంచి  ఎన్నో వెసులుబాటులు దొరుకుతాయి. సరిగ్గా అలాంటి అవ‌కాశం కోస‌మే మారుతి ఇంత కాలం వెయిట్ చేసారు. ఛాన్స్ రావ‌డం  ఆల‌స్య‌మైనా ఏకంగా పాన్ ఇండియా స్టార్  ప్ర‌భాస్ నే  డైరెక్ట్ చేసే అవకాశం ద‌క్కింది.

మెగాస్టార్ చిరంజీవి సైతం త‌న ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయాల‌ని ఉంద‌ని ప‌బ్లిక్ గానే ప్రామిస్ చేసారు. ఆ ర‌కంగా మారుతికి అదొక గొప్ప అచీవ్ మెంట్. ఎలాంటి బ్యాక‌ప్ లేకుండా ఇండ‌స్ర్టీకి వ‌చ్చి ఇలా ఎద‌గ‌డంలో మారుతి కృషి ఎంతో ఉంది. ఈ క్ర‌మంలో మెగా క్యాంప్ అత‌న్ని ఎంతో  ప్రోత్స‌హించింది. కెరీర్ ఆరంభంలో ఎద‌గ‌డంలో ఎంతో స‌హ‌క‌రించింది.

త‌న లో ప్ర‌తిభని గుర్తించి అల్లు అర‌వింద్ లాంటి అవ‌కాశాలు ఇవ్వ‌డంతోనే ఇంత‌టి వాడు కాగ‌లిగాడు. అప్పుడే ప‌రిశ్ర‌మకి వ‌చ్చిన అల్లు శిరీష్‌కి  స‌క్సెస్ ఇచ్చి  న‌టుడిగా అత‌నికి ఓ ఐడెంటిటీ తీసుకొచ్చాడు. అయితే అవే పాత జ్ఞాప‌కాలు ఇప్ప‌టికీ మారుతిని వెంటాడుతున్నాయ‌ట‌. ద‌ర్శ‌కుడిగా ఉన్నత శిఖ‌రాల్ని అధిరోహించాల‌ని క‌ల‌లు గంటోన్న మారుతి ని ఓ యంగ్ హీరో తో సినిమా చేయమ‌ని ఓ బ‌డా నిర్మాత ఒత్తిడి తీసుకొస్తున్నాడుట‌.

ఈ నేప‌థ్యంలో మారుతి అత‌ని మాట‌ని కాద‌న‌లేడు...చేయ‌లేనిన క‌రాకండీగా చెప్ప‌లేక ఇబ్బంది పడుతోన్న స‌న్నివేశం ఎదుర‌వుతోంద‌ని స‌మాచారం.

మారుతి రేంజ్ మారిన త‌రుణంలో  కొత్త వారితో సినిమాలు చేస్తే త‌న ఇమేజ్ కి డ్యామేజ్ అవుతుంద‌నే భ‌యం కార‌ణంతో  ముందుకు వెళ్ల‌లేని స్థితిలో ఉన్నాడ‌ని  స‌న్నిహిత వ‌ర్గాల నుంచి లీకైంది.

ఇటీవ‌లే ఆ హీరో న‌టించిన సినిమా  భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అయింది. కానీ వాటిని అందుకోవ‌డంలో విఫ‌ల‌మైంది. స‌క్సెస్ అనివార్య‌మైన త‌రుణమిది. ఈ నేప‌థ్యంలో ఆ యంగ్ మారుతి లాంటి మేక‌ర్ చేతిలో ప‌డితే త‌ప్ప ప‌న‌వ్వ‌ద‌ని భావించి సీరియ‌స్ గానే మంత‌నాలు జ‌రుపుతున్న‌ట్లు గుస గుస వినిపిస్తుంది.  మ‌రి ద‌ర్శ‌కుడు క‌రుణిస్తాడో  లేదో.  ప్ర‌స్తుతం మారుతి  'రాజా డీల‌క్స్' చిత్రాన్ని తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News