దేశ వ్యాప్తంగా ప్రస్తుతం లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో సినిమా షూటింగులు.. సినిమా రిలీజ్ లు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇప్పట్లో థియేటర్లు ఓపెన్ అయ్యి సినిమాలు రిలీజయ్యే పరిస్థితి కనిపించడం లేదు. థియేటర్స్ పూర్తిగా మూసేయడంతో డిస్ట్రిబ్యూటర్స్, బయ్యర్స్, థియేటర్స్ నిర్వాహకులు తీవ్ర గడ్డుకాలాన్ని ఎదర్కొంటున్నారు. చిత్ర పరిశ్రమ మూత పడడంతో చిన్న నిర్మాతలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. సినిమాల కోసం ఫైనాన్సియర్ల దగ్గర డబ్బులు తీసుకున్న కొందరు చిన్న నిర్మాతలు వడ్డీలు భరించలేక డైరెక్ట్ గా ఓటీటీ రిలీజ్ చేయడమే శరణ్యమని భావిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన సినిమాలను ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ ద్వారా రిలీజ్ చేయాలని కొందరు నిర్మాతలు అనుకుంటున్నారు. ఈ లాక్ డౌన్ సమయాన్ని క్యాష్ చేసుకోవాలని చూస్తున్న ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ క్రేజ్ ఉన్న సినిమాలకు అధిక మొత్తం చెల్లించడానికి ముందుకొస్తున్నాయి.
ఈ నేపథ్యంలో జ్యోతిక ప్రధాన పాత్రలో నటించిన ‘పొన్మగల్ వంధాల్’ అనే సినిమాను డైరెక్ట్ గా ఓటీటీ రిలీజ్ చేయాలని భావించారు. ఈ చిత్రాన్ని నిర్మించిన హీరో సూర్య ఈ సినిమాను నేరుగా ఓటీటీలో విడుదల చేయాలని అనుకున్నారు. ఈ మేరకు అమెజాన్ ప్రైమ్ తో ఓ ఒప్పందం కుదుర్చుకోవడం కూడా జరిగిందట. దీంతో మరికొంత మంది చిన్న నిర్మాతలు కూడా తమ చిత్రాలను విడుదల చేయడానికి ఆసక్తి చూపారు. దీంతో సూర్యపై థియేటర్ల యాజమాన్యం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇకపై సూర్య నిర్మించే ఎలాంటి చిత్రాలను తమ థియేటర్ లలో విడుదల చేయబోమని తీర్మానం చేశారు. ఇదిలా ఉండగా తాజాగా కేరళ సినీ థియేటర్ల సంఘం కూడా సూర్యకు షాక్ ఇచ్చింది. ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో చిత్రాలను విడుదల చేయాలని తీసుకున్న సూర్య నిర్ణయాన్ని ఆ సంఘం కూడా తీవ్రంగా ఖండించింది. తాము కూడా సూర్య నిర్మించే.. నటించే చిత్రాలను విడుదల చేయబోమని వెల్లడించింది. దీంతో సూర్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారా అని సినీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.