కోవిడ్-19 నిబంధనలను గాలికొదిలేసిన థియేటర్స్..!

Update: 2020-12-26 13:45 GMT
కరోనా మహమ్మారి కారణంగా ఏర్పడిన పరిస్థితుల నుంచి బయటపడటానికి సినీ ఇండస్ట్రీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. లాక్ డౌన్ సడలింపులలో భాగంగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ 50 శాతం సీటింగ్ కెపాసిటీతో థియేటర్స్ ఓపెన్ చేసుకోవడానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా పర్మిషన్ వచ్చినప్పటికీ కొన్నాళ్లు వేచి చూసిన థియేటర్ యాజమాన్యాలు ఇప్పుడు పూర్తి స్థాయిలో సినిమా హాళ్లు రీ ఓపెన్ చేశారు. ముందుగా మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన 'సోలో బ్రతుకే సో బెటర్' చిత్రాన్ని థియేటర్స్ లో విడుదల చేశారు. క్రిస్మస్ సందర్భంగా రిలీజైన ఈ సినిమాకి మంచి స్పందన తెచ్చుకుంది. గత కొన్ని నెలలుగా థియేటర్ ఎక్సపీరియన్స్ కి దూరమైన సినీ ప్రియులు సినిమా కోసం క్యూలు కట్టారు. అయితే దీన్ని క్యాష్ చేసుకోవాలని చూసిన కొన్ని థియేటర్స్ కోవిడ్ నిబంధనలను గాలికొదిలేశాయని తెలుస్తోంది.

కేంద్ర ప్రభుత్వం సూచించిన ప్రకారం థియేటర్స్ లో సగం సీటింగ్ ఆక్యుపెన్సీతో సినిమా ప్రదర్శించాల్సి ఉంది. కరోనా జాగ్రత్తలు తీసుకుంటూ సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ సీట్స్ కేటాయించాల్సి ఉంది. అయితే తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని థియేటర్ యాజమాన్యాలు నిబంధనలు తుంగలో తొక్కి థియేటర్ ని ఫుల్ చేసే ప్రయత్నాలు చేశారట. సీట్ కి సీట్ కి మధ్య గ్యాప్ చూపిస్తూ ఆన్లైన్ లో 50 శాతం బుకింగ్స్ పెట్టిన కొన్ని థియేటర్స్.. కౌంటర్ల వద్ద మిగతా 50శాతం టికెట్స్ అమ్మారని తెలుస్తోంది. ముఖ్యంగా బీ సీ సెంటర్స్ లో ఇది కనిపించింది. కరోనా పూర్తిగా నిర్మూలించలేకపోతున్న ఇలాంటి పరిస్థితుల్లో ఇది సీరియస్ గా పరిగణించాల్సిన విషయమనే చెప్పాలి. కోవిడ్ సెకండ్ వేవ్ ఉందనే భయంతో అందరూ కలవర పడుతున్న సమయంలో సామాజిక దూరం పాటించకుండా ఇలాంటి చర్యలకు పాల్పడటం ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది.
Tags:    

Similar News