చియాన్ విక్రమ్ వారసుడు ధృవ్ కి డెబ్యూ కష్టాలు ఇంకా తీరేట్టు లేవ్. కొడుకుని స్టార్ రేంజులో పరిచయం చేయడం కోసం విక్రమ్ ఎంతగా శ్రద్ధ తీసుకుంటున్నారో అంతకుమించి కష్టాల్ని ఎదుర్కోవాల్సి వస్తోంది. బ్లాక్ బస్టర్ `అర్జున్ రెడ్డి` స్క్రిప్టుని ఎంపిక చేసుకుని బరిలో దిగిన చియాన్ బృందం ఒకసారి సినిమా పూర్తి చేసి స్క్రాప్ లో వేసింది. తన ఫేవరెట్ దర్శకుడు బాలానే అవమానించి విభేధించాల్సి వచ్చింది. ఆ ఎపిసోడ్స్ ముగిసిపోయాయి అనుకుంటే.. ఆ తర్వాత కూడ కోర్టులు కేసులు అంటూ బాలా ఎదురు తిరిగిన సంగతి తెలిసిందే.
గతం గతః అనుకుంటే.. వర్తమానంలో చియాన్ వారసుడి సన్నివేశమేమిటి? అంటే.. అతడు నటించిన రీమేక్ చిత్రం `ఆదిత్య వర్మ` రిలీజ్ సంకటాన్ని ఎదుర్కొంటోంది. ఈ సినిమాకి తమిళనాడులో థియేటర్లు లేకుండా పోయాయట. ఇప్పటికీ ఆదిత్య వర్మ చిత్రానికి సరైన థియేటర్లు సెట్ కాలేదని తెలుస్తోంది. బహుశా ఈ కారణంతోనే ఇంకా రిలీజ్ తేదీని టీమ్ ప్రకటించలేదని ప్రచారమవుతోంది. ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి కాలేదని .. తొలి కాపీ లో కూడా కొన్ని మార్పులు చేసేందుకు ప్లాన్ చేశారని తెలుస్తోంది.
ఆదిత్య వర్మ చిత్రానికి అర్జున్ రెడ్డి అసిస్టెంట్ డైరెక్టర్ గిరీషయ్య దర్శకత్వం వహిస్తున్నారు. బానిటా సంధు కథానాయికగా నటిస్తుండగా.. ఇందులో ప్రియా ఆనంద్ మరో కీలక పాత్రధారి. ఈ4 ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. టీజర్.. ట్రైలర్ తో ఆసక్తిని పెంచడంలో సక్సెసయ్యారు. ధృవ్ డెబ్యూ మూవీపై చాలానే శ్రద్ధ తీసుకుని ఈ నవతరం దర్శకుడు తెరకెక్కించాడని అర్థమవుతోంది. అయితే ప్రస్తుతం రిలీజ్ ముంగిట డైలమా కలవరపెడుతోంది. ఈ చిత్రం రిజల్ట్ పై ఇటు ధృవ్ కెరీర్ అటు గిరీషయ్య కెరీర్ ఆధారపడి ఉన్నాయి. ఆ క్రమంలోనే కోలీవుడ్ సహా టాలీవుడ్ లోనూ దీనిపై ఆసక్తికర చర్చ సాగుతోంది. చివరి నిమిషం వరకూ రీషూట్లు.. ఛేంజెస్ అంటూ తాత్సారం చేయడం వెనక చాలానే స్ట్రగుల్ ఉంది. మరి దీనినుంచి ఎలా ఓవర్ కమ్ అవుతారో చూడాలి.