థియేటర్‌ ఆర్టిస్టుని వెతికి పట్టుకున్నాడు

Update: 2015-08-08 06:52 GMT
డైరెక్టర్‌ తేజ ఓ సినిమా చేస్తున్నాడంటే పరిశ్రమ కళ్లు అటువైపే ఉంటాయి. ఎందుకంటే అతడు హిట్‌ కొడితే మైండ్‌ బ్లాంక్‌ అయిపోయేలా ఉంటుంది. పరిమిత బడ్జెట్‌ తో కొత్త నటీనటుల్ని ఎంపిక చేసుకుని ప్రేమకథల్ని తెరకెక్కించడంలో తనకంటూ ఓ మార్క్‌ ఉందని నిరూపించిన దర్శకుడాయన. అందుకే ఇప్పుడు అతడి నుంచి హోరా హోరీ అనే లవ్‌ స్టోరీ వస్తోందంటే యువతరం అటెన్షన్‌ లోకి వచ్చేసింది. ఈ చిత్రంలో నాయకానాయికల్నే కాదు విలన్‌ ని కూడా కొత్త కుర్రాడినే పరిచయం చేస్తున్నాడు.

అతడి పేరు చస్వా. థియేటర్‌ ఆర్ట్స్‌ లో గోల్డ్‌ మెడలిస్ట్‌. థియేటర్‌ నేపథ్యం నుంచి సినిమాల్లోకొచ్చాడు. కన్నడలో ఇప్పటికే ఆరు సినిమాల్లో నటించాడు. తేజ ఆడిషన్స్‌ చేసినప్పుడు హైదరాబాద్‌ వచ్చి కలుసుకున్నాడు. అతడి నటనకు ఇంప్రెస్‌ అయిన తేజ వెంటనే విలన్‌గా ఎంపిక చేసుకున్నాడు. ఈ సంగతుల్ని చస్వా స్వయంగా వెల్లడించాడు. థియేటర్‌ కి, సినిమాకి తేడా చెబుతూ.. రెండుచోట్లా నటన అనేది సెన్సిటివ్‌ గానే ఉంటుంది. అయితే స్టేజీ మీద నటించేప్పుడు ప్రతి చిన్న ఎక్స్‌ ప్రెషన్‌ అన్ని వైపులా ఉన్న ఆడియెన్‌ కి కనిపించదు. అదే సినిమాలో అయితే కెమెరా అన్ని ఎక్స్‌ ప్రెషన్స్‌ ని చూపిస్తుంది. స్టేజీ పై నటనలో ఎక్కువ డ్రమటిక్‌ గా ఉంటుంది. సినిమాల్లో కాస్త సహజసిద్ధత ఉంటుంది.. అంటూ తన అనుభవాల్ని చెప్పుకొచ్చాడు.

చస్వా ప్రస్తుతం పీహెచ్‌ డి చేస్తూనే నటనలో కొనసాగుతున్నాడు. చూడటానికి ఏఎన్నార్‌ లా ఉన్నాడు. ఈయనగారి విలనీ ఎలా ఉంటుందో తెరపై చూసి చెప్పాలి.
Tags:    

Similar News