‘బాహుబలి: ది కంక్లూజన్’ టికెట్ బుక్ చేద్దామని ‘బుక్ మై షో’ వెబ్ సైట్ ఓపెన్ చేస్తాం. మనకు కావాల్సిన థియేటర్ దగ్గరి కెళ్తాం. ఫలానా షోకు టికెట్ అందుబాటులో ఉన్నట్లుగా చూపిస్తుంది వెబ్ సైట్. దాన్ని క్లిక్ చేసి లోపలికెళ్తే సీట్లన్నీ గ్రే కలర్లో కనిపిస్తాయి. వెనక్కి వచ్చి ఇంకో థియేటర్లో మరో షో సెలక్ట్ చేస్తాం. లోపలికెళ్తే రెండు సీట్లు ఖాళీ ఉన్నట్లుగా చూపిస్తుంది. ఆ సీట్లను సెలక్ట్ చేసుకుని పేమెంట్ చేద్దామని ఆత్రుతగా ముందుకెళ్లబోతాం. అక్కడ పడుతుంది బ్రేక్. కొంతసేపు వెయిటింగ్ లో పెట్టి ‘సారీ సంథింగ్ వెంట్ రాంగ్’ అన్న మెసేజ్ వస్తుంది. ఇంకొన్ని స్క్రీన్ల విషయంలో షో మీద క్లిక్ చేయగానే రిఫ్రెష్ అయిపోతుంది. ఇలా ‘బాహుబలి-2’ టికెట్ల విషయంలో కనిపిస్తున్న వింతలు ఎన్నెన్నో...
.
ఒక థియేటర్లో టికెట్ల బుకింగ్ ఓపెన్ అయిన వెంటనే అందులో టికెట్లన్నీ బుక్ అయిపోయినట్లు చూపిస్తోంది ‘బుక్ మై షో’. అలాగని అంత వేగంగా జనాలు టికెట్లు కొనేస్తున్నారేమో అనుకుంటే పొరబాటే. టికెట్లన్నీ బ్లాక్ చేసేసి.. ఊరికే నామమాత్రంగా బుక్ మై షోలో పెట్టామంటే పెట్టామనిపించి జనాల్ని వెర్రిబాగుల వాళ్లను చేస్తున్నాయి థియేటర్ల యాజమాన్యాలు. ఇందులో ‘బుక్ మై షో’ భాగస్వామ్యం ఎంత మేరకు ఉందన్నది చెప్పలేం. మొత్తానికి బాహుబలి-2 టికెట్లకు ఉన్న డిమాండ్ ను సొమ్ము చేసుకోవడానికి జనాల్ని వెర్రి వాళ్లను చేస్తున్నారు. ఇది కచ్చితంగా ఘరానా మోసమే అని చెప్పాలి. టికెట్లన్నీ తమ దగ్గరే ఉంచుకుని ఎక్కువ రేట్లకు అమ్ముకోవాలనుకున్నపుడు.. అసలు బుక్ మై షో వరకు రావడం ఎందుకు? జనాల్ని పిచ్చి వాళ్లను చేయడం ఎందుకు..? బుక్ మై షోలో వాళ్లు గంటలు గంటలు పడిగాపులు చేసేలా చేయడం ఎందుకు? కొన్ని గంటల నుంచి ప్రయత్నిస్తున్నా.. ఒక టికెట్ కూడా బుక్ చేయలేని పరిస్థితి ఉందంటే ఇది కచ్చితంగా ఘరానా మోసమే. మరి ఈ మోసం గురించి పట్టించుకునేదెవరు? చర్యలు తీసుకునేదెవరు?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/