‘శాతకర్ణి’కి థియేటర్ల సమస్య..?

Update: 2017-01-09 15:40 GMT
ఓవైపు ఆర్.నారాయణమూర్తి తన సినిమా ‘హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య’కు థియేటర్లు కేటాయించకపోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. అన్ని థియేటర్లనూ ‘ఖైదీ నెంబర్ 150’.. ‘గౌతమీపుత్ర శాతకర్ణి’లకే కేటాయించేశారని మండిపడ్డారు. ఐతే ఇప్పుడు థియేటర్ల విషయంలో చిరు.. బాలయ్య సినిమాల మధ్యే గొడవలు తలెత్తే పరిస్థితి కనిపిస్తోంది. రేసులో ముందుగా వస్తున్న ‘ఖైదీ నెంబర్ 150’కే మెజారిటీ థియేటర్లు కట్టబెట్టేసి.. ‘గౌతమీపుత్ర శాతకర్ణి’కి అన్యాయం చేస్తున్నారంటూ బాలయ్య అభిమానుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. గత కొంత కాలంగా బాక్సాఫీస్ కొంచెం డల్లుగా నడుస్తుండగా.. సంక్రాంతి సినిమాల క్రేజ్ ను క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు డిస్ట్రిబ్యూటర్లు.. ఎగ్జిబటర్లు.

ముందుగా రానున్న ‘ఖైదీ నెంబర్ 150’ని తొలి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ 90 శాతం థియేటర్లలో నింపేస్తున్నారు. కాగా 11న చిరంజీవి సినిమాను ప్రదర్శించబోతున్న థియేటర్లలో ఎంత మేరకు తర్వాతి రోజు బాలయ్య సినిమాకు మళ్లుతాయన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. బాలయ్య సినిమాకు ఇవ్వాల్సిన థియేటర్ల లెక్కపై ఇంకా తర్జన భర్జనలు నడుస్తున్నాయి. ఏపీలోని చాలా ఏరియాల్లో ఇబ్బందేమీ లేదు కానీ.. నైజాం ఏరియాలో మాత్రం గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణికి కొంత వ‌ర‌కు థియేట‌ర్ల స‌మ‌స్య ఎదుర‌వుతోంద‌ని స‌మాచారం.ఈ ప్రాంతంలో ఇంకా శాత‌క‌ర్ణి థియేట‌ర్లు ఫైన‌లైజ్ కాలేదు. చిరు సినిమా టాక్ ను బట్టి బాలయ్య చిత్రానికి థియేటర్లు ఫైనలైజ్ చేసే రకంగానూ చర్చలు నడుస్తున్నాయి. ఈ కన్ఫ్యూజన్ వల్లే ఇంకా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ బుక్సింగ్స్ అన్ని థియేటర్లలోనూ ఓపెన్ చేయలేదు. శాతకర్ణి టీం ఆశిస్తున్న స్థాయిలో థియేటర్లు దక్కట్లేదని.. ఈ విషయంలో అభిమానులు అసంతృప్తితో ఉన్నార‌ని తెలుస్తోంది. రేపటికి థియేటర్ల విషయంలో ఒక క్లారిటీ రావచ్చు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News