ప్రభాస్ - చరణ్ లాంటి స్టార్లు పాన్ ఇండియా రేస్ ని పీక్స్ కి తీసుకెళుతున్నారు. ఆ ఇద్దరూ పూర్తి పాన్ ఇండియా అప్పీల్ ఉన్న సినిమాలతో దూసుకెళుతున్నారు. ప్రభాస్ ప్రస్తుతం ఆదిపురుష్ - సలార్ లాంటి భారీ పాన్ ఇండియా సినిమాలు చేస్తుంటే.. చరణ్ కూడా రాజమౌళితో ఆర్.ఆర్.ఆర్ తర్వాత శంకర్ దర్శకత్వంలో అసాధారణ ప్రాజెక్టుకి కమిటయ్యారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ సైతం ఆర్.ఆర్.ఆర్ తో పాన్ ఇండియా రేసులో ఉన్నారు.
వీళ్లతో పోటీపడుతూ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా ప్లాన్ సాగుతోంది. ప్రస్తుతం అతడు సుకుమార్ దర్శకత్వంలో తొలి పాన్ ఇండియా చిత్రం పుష్పలో నటిస్తున్నాడు. ఈ సినిమా తెలుగు-తమిళం-మలయాళం- హిందీ లో రిలీజ్ కానుంది. ఆ తర్వాత కూడా బన్ని క్యూలో కేజీఎఫ్ ప్రశాంత్ నీల్ తో పాటు ఏ.ఆర్ మురుగదాస్ లాంటి దర్శకులు ఉన్నారు. ఆ ఇద్దరూ పాన్ ఇండియా అప్పీల్ ఉన్న స్టార్ డైరెక్టర్స్.
నిజానికి చాలా కాలం క్రితమే మురుగదాస్ బన్నీకి లైన్ వినిపించారని కథనాలొచ్చినా అప్పట్లో ప్రాజెక్ట్ టేకాఫ్ కాలేదు. కానీ ఇప్పుడు సుకుమార్ తో పుష్ప పూర్తి చేశాక మురుగదాస్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసే అవకాశం ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. దర్శకుడు శ్రీరామ్ వేణుతో ఐకాన్ అనే పాన్ ఇండియన్ చిత్రాన్ని ప్లాన్ చేసినా అది క్యాన్సిల్ అయ్యాక ఇప్పుడు మళ్లీ మురుగదాస్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అయితే కేజీఎఫ్ ప్రశాంత్ నీల్ తదుపరి సలార్ ముగించి బన్నీకి టచ్ లోకి వస్తే ఇరువురి మధ్యా పోటీ ఖాయమా అన్నది కూడా చూడాలి.