అక్టోబర్ నెల తెలుగు సినిమాకు పెద్దగా కలిసి రాలేదు. దసరా - దీపావళి వంటి రెండు ఫెస్టివల్ సీజన్స్ ఉన్నా ఫలితం లేకుండా పోయింది. రెండు డబ్బింగ్ చిత్రాలు మాత్రమే టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద హిట్ స్టేటస్ అందుకున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు నవంబర్ లో అనేక చిన్న మీడియం రేంజ్ చిత్రాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోడానికి రెడీ అయ్యాయి.
నవంబర్ మొదటి వారంలో మొత్తం 10 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అందులో ఎనిమిది స్ట్రెయిట్ తెలుగు చిత్రాలైతే.. రెండు డబ్బింగ్ చిత్రాలు. అల్లు శిరీష్ 'ఊర్వశివో రాక్షసివో' - సంతోష్ శోభన్ 'లైక్ షేర్ & సబ్స్క్రైబ్' - నందూ 'బొమ్మ బ్లాక్ బస్టర్' - నవీన్ చంద్ర 'తగ్గేదే లే' సినిమాలు నవంబర్ 4న థియేటర్లలోకి రాబోతున్నాయి.
వీటితో పాటుగా 'సారధి' 'జెట్టి' 'చింతామణి సొంత మొగుడు' వంటి మరికొన్ని చిన్న సినిమాలు.. 'ఆకాశం' 'బనారస్' వంటి డబ్బింగ్ చిత్రాలు ఈ శుక్రవారమే రిలీజ్ అవుతున్నాయి. అలానే 40 ఏళ్ల క్రితం నాటి అక్కినేని నాగేశ్వర రావు 'ప్రతిబింబాలు' సినిమా నవంబర్ 5న విడుదల కాబోతోంది.
ఈ వారం పేరుకి పది సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కానీ.. ఒక్క దానికి కూడా అడ్వాన్స్ బుకింగ్స్ ఆశాజనకంగా లేవు. వాటిల్లో గుర్తింపు ఉన్న హీరోలు - పెద్ద బ్యానర్లలో రూపొందిన సినిమాలు కూడా ఉన్నాయి కానీ.. బుకింగ్స్ లో మాత్రం ఏమాత్రం ట్రెండ్ కనిపించడం లేదు.
ప్రమోషన్స్ చేయడం లేదా అంటే.. అందరూ ఆన్ లైన్ మరియు ఆఫ్ లైన్ లో దూకుడుగా ప్రచారం చేస్తూనే ఉన్నారు. కాలేజీ టూర్లు - గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లు - వరుస పెట్టి ఇంటర్వ్యూలతో సందడి చేస్తునే ఉన్నారు. అయినప్పటికీ ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమా చూసెయ్యాలి అనే విధంగా జనాలను ప్రేరేపించలేకపోతున్నారు.
ఓటీటీలకు అలవాటు పడిపోయిన జనాలు.. ఇటీవల కాలంలో చాలా సెలెక్టివ్ గా థియేటర్లకు వెళ్లి సినిమాలు చూస్తున్నారు. ట్రైలర్ తో ఆకట్టుకున్న చిత్రాలు - సరికొత్త అనుభూతిని పంచే గ్రాండియర్ సినిమాలు చూస్తున్నారు. అలానే ఫస్ట్ డే టాక్ ని బట్టి సినిమాకు వెళ్ళాలా వద్దా అని డిసైడ్ అవుతున్నారు. ఇప్పుడు ఈ వారం రిలీజ్ అయ్యే చిత్రాలకు కూడా టాక్ కీలకంగా మారనుంది.
శుక్రవారం వచ్చే సినిమాల్లో గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు శిరీష్ - అను ఎమ్మాన్యూయేల్ జంటగా నటించిన 'ఊర్వశివో రాక్షశివో' చిత్రానికి కాస్త బజ్ ఉందని చెప్పాలి. ప్రమోషనల్ కంటెంట్ కి వచ్చిన రెస్పాన్స్ ను బట్టి చూస్తే.. ఇది యూత్ ఆడియన్స్ ని థియేటర్లకు రప్పిస్తుందనిపిస్తోంది.
అలానే సంతోష్ శోభన్ - ఫారియా అబ్దుల్లా జంటగా నటించిన 'లైక్ షేర్ & సబ్ స్క్రైబ్' సినిమా కూడా ఓ వర్గం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించే అవకాశం ఉంది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ కూడా ప్రామిసింగ్ గా అనిపించింది. ఇక ఈ వారం వచ్చే మిగతా సినిమాలేవీ ఏమాత్రం సందడి చేయడం లేదు.
బజ్ ఉన్నా లేకపోయినా అడ్వాన్స్ బుకింగ్స్ మరీ దారుణంగా ఉన్నాయి కాబట్టి.. ఈ వారం రిలీజ్ అయ్యే సినిమాలకు మౌత్ టాక్ అనేది కీలకమని అర్థమవుతుంది. బాగుందని టాక్ బయటకు వస్తే.. జనాలు థియేటర్ వరకూ వెళ్లి సినిమా చూసే అవకాశం ఉంది. ఇటీవల చాలా చిత్రాలు కేవలం మంచి మౌత్ టాక్ తోనే బాక్సాఫీస్ హిట్లుగా నిలిచాయి. మరి ఈ వారం రాబోతున్న 10 సినిమాల్లో ఏవేవి ప్రేక్షకాదరణ పొందుతాయో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.