ఆ విష‌యంలో జ‌క్క‌న్న‌ని మించిన మాస్ట‌ర్ లేరు!

Update: 2022-09-10 10:31 GMT
ఒక సినిమాకు ప్ర‌ధాన ఆయువు ప‌ట్టు ఎమోష‌న్‌. దానికి క‌రెక్ట్ గా ప్రేక్ష‌కుడిని క‌రెక్ట్ చేయ‌గ‌లిగితేనే అది బాక్సాఫీస్ వ‌ద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలుస్తుంది. ప్ర‌తీ సినిమాకు ఇదే ప్ర‌ధాన పాత్ర పోషిస్తూ వుంటుంది. ఆ ఎమోష‌న్ ని స‌గ‌టు ప్రేక్ష‌కుడు ఫీలైన‌ప్పుడే సినిమా స‌క్సెస్ లేదంటే ఫ్లాప్‌. ఇక కొన్ని ప‌వ‌ర్ ఫుల్ ఎమోష‌న‌ల్ డ్రామాల‌కు కూడా ప్ర‌ధాన యుఎస్ పీ ఎమోష‌న్‌. దీన్ని క‌రెక్ట్ గా ప్రేక్ష‌కుడికి క‌న్వే చేయ‌డంలో స్టార్ డైరెక్ట‌ర్ రాజ‌మౌళి త‌రువాతే ఎవ‌రైనా.

ఆ ఎమోష‌న్ ని ప‌ట్టుకోవ‌డంలో రాజ‌మౌళి మాస్ట‌ర్‌. ఇది 'మ‌గ‌ధీర‌'తో కొంత వ‌ర‌కు తెలిస్తే 'బాహుబ‌లి' సీరీస్‌ సినిమాల‌తో యావ‌త్ సినీ ప్ర‌పంచానికి మ‌రింత‌గా తెలిసింది. ఇక 'RRR'లో అల్లూరి, భీమ్ పాత్ర‌ల‌ని తీర్చి దిద్దిన తీరు, ఆ పాత్ర‌ల‌కు బ‌ల‌మైన ఎమోష‌న్ ని జోడించిన తీరు ప్ర‌తీ ఒక్క‌రినీ అబ్బుర ప‌రిచింది.

ఈ పాత్ర‌ల‌కు పూర్తిగా క‌నెక్ట్ అయ్యేలా చేసింది. ఎంత భారీ బ‌డ్జెట్ లు, భారీ సెట్ లు, హంగామా వున్నా త‌న సినిమాల్లోని పాత్ర‌ల‌కు ఎమోష‌న్ ని జోడించి ఆ పాత్ర‌ల‌ని ప‌వ‌ర్ ఫుల్ గా మలిచి అనుకున్న క‌థ‌ని ర‌క్తిక‌ట్టించ‌డంతో రాజ‌మౌళి త‌రువాతే ఎవ‌రైనా.

ఇది చాలా సందర్భాల్లో రుజవైంది కూడా. వేరే ద‌ర్శ‌కులు తెర‌కెక్కించిన చారిత్రాత్మ‌క సినిమాల‌ని చూసిన చాలా మంది ఈ సినిమా రాజ‌మౌళి తీసి వుంటే మ‌రోలా వుండేద‌ని పెద‌వి విరిచిన సంద‌ర్భాలు చాలానే వున్నాయి. తాజాగా ఇలాంటి చ‌ర్చే ఇప్ప‌డు బాలీవుడ్ మూవీ 'బ్ర‌హ్మ‌స్త్ర‌' విష‌యంలోనూ వినిపిస్తోంది. ర‌ణ్ బీర్ క‌పూర్‌, అమితాబ్ బ‌చ్చ‌న్‌, నాగార్జున‌, అలియా భ‌ట్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన ఈ మూవీని అయాన్ ముఖ‌ర్జీ తెర‌కెక్కించాడు.
 
భారీ అంచ‌నాలు నెల‌కొన్న ఈ మూవీ సెప్టెంబ‌ర్ 9న శుక్ర‌వారం భారీ స్థాయిలో ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. మ‌న పేరాణాలు, ఇతిహాసాల నేప‌థ్యంలో స‌క‌ల హ‌స్త్రాల దేవ‌త అయిన బ్ర‌హ్మాస్త్రం నేప‌థ్యంలో సినిమాని అయాన్ ముఖ‌ర్జీ తెర‌కెక్కించాడు. ఈ క‌థ కు ఎమోష‌న్ ప్ర‌ధానం. అయితే అదే ఈ క‌థ‌లో క‌నిపించ‌లేదు. భారీ స్టార్ కాస్ట్‌... అబ్బుర ప‌రిచే హాలీవుడ్ సినిమాల స్థాయి గ్రాఫిక్స్ వున్నా కావాల్సిన ఎమోష‌న్ క‌రువ‌వ్వ‌డంతో స‌గ‌టు ప్రేక్ష‌కుడిని సినిమాలో లీనం అయ్యేలా చేయ‌లేక‌పోయింది.

అయితే ఇదే ప్రాజెక్ట్ ని రాజ‌మౌళి టేక‌ప్ చేసి వుంటే క‌థ వేరుగా వుండేద‌న్న‌ది ప్ర‌తీ ఒక్క‌రి వాద‌న‌. ఎమోష‌న్ ని పండించి క‌థ‌ని ర‌స‌వ‌త్త‌రంగా న‌డ‌ప‌డం.. ప్రేక్ష‌కుడిని ఎమోష‌న్ తో క‌నెక్ట్ చేయ‌డంలో రాజ‌మౌళి మాస్ట‌ర్‌. త‌నే ఈ ప్రాజెక్ట్ ని డీల్ చేసి వుంటే అనుకున్న ఎమోష‌న్ ఖ‌చ్చితంగా క్యారీ అయ్యేద‌ని అదే జ‌రిగితే 'బ్ర‌హ్మాస్త్ర‌' లెక్క వేరేలా వుండేద‌ని చెబుతున్నారు. వెండితెర‌పై ఎమోష‌న్ తో అద్భుతాలు చేస్తున్న జ‌క్క‌న్న‌ని ఈ విష‌యంలో బీట్ చేసేవారు లేరని 'బ్ర‌హ్మాస్త్ర‌'తో మ‌రో సారి రుజువైంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News