కరోనా నేపథ్యంలో ఒక్క నిర్ణయంతో యావత్ దేశం మొత్తం లాక్ డౌన్ అమలుచేయటం తెలిసిందే. అనంతరం దశల వారీగా లాక్ డౌన్ నిబంధనల్ని ఒక్కొక్కటిగా సడలిస్తున్న సంగతి తెలిసిందే. అన్ లాక్ 1.0 పేరుతో మొదలైన ఈ ప్రక్రియ త్వరలో 4.0కు కేంద్రం వెల్లడిస్తుందని చెబుతున్నారు. ఇప్పటికి మూడు అన్ లాక్ ల్నికేంద్రం ప్రకటించినప్పటికీ.. సినిమాహాళ్లు.. జిమ్ లు.. యోగా కేంద్రాలు లాంటి వాటికి ఓకే చెప్పలేదు. వీటితో పాటు..మెట్రో రైళ్లకు అనుమతి ఇవ్వలేదు.
కాంటాక్ట్ లెస్ టికెటింగ్.. రెగ్యులర్ శానిటైజ్ చేయటంతో పాటు.. మరిన్ని భద్రతా పరమైన చర్యల్ని పొందుపర్చి.. సినిమా థియేటర్లు ఓపెన్ చేయటానికి అనుమతి ఇస్తారని చెబుతున్నారు. మరి.. ఈ అంచనాలు ఏమేరకు నిజం అవుతాయన్నది కేంద్రం వెల్లడించే అన్ లాక్ 4.0 ప్రకటనతో కానీ స్పష్టం కాదు.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం కొత్తగా ప్రకటించే అన్ లాక్ 4.0లో సినిమా హాళ్లకు ఓకే చెప్పనున్నట్లుగా చెబుతున్నారు. దాదాపుఐదు నెలలకుపైనే సినిమాథియేటర్లు మూసి ఉంచటంతో అటు ప్రభుత్వాలకు.. ఇటు లక్షలాది మందికి ప్రత్యక్ష.. పరోక్షంగా ఉపాధికి గండి పడింది. దీంతో.. ఈసారిఅన్ లాక్ లో సినిమా థియేటర్లకు ఓకే చెప్పనున్నట్లు చెబుతున్నారు. అయితే.. సినిమా థియేటర్ల ప్రారంభానికి ప్రభుత్వం త్వరలోనే మార్గదర్శకాల్ని విడుదల చేస్తారని చెబుతున్నారు.
కరోనా నేపథ్యంలో థియేటర్లలో ఏసీ 24 డిగ్రీలు ఉండేలాజాగ్రత్తలు తీసుకోవాలని.. ఇప్పటికే త్రీడీ సీనిమాలకు స్పెషల్ కళ్లజోడు ఇస్తున్నట్లే.. ప్రస్తుతం సినిమా చూస్తున్నంతసేపు ముఖానికి మాస్కు పెట్టుకోవాలన్న నిబంధన కూడా తీసుకు రానున్నట్లు చెబుతున్నారు. అంతేకాదు.. ప్రతి షో తర్వాత సినిమా హాల్ మొత్తాన్ని పూర్తిగా శానిటైజ్ చేయాలన్న కఠిన నిబంధనను అమలు చేస్తారని చెబుతున్నారు.