ఆలియా భట్ హీరోయిన్ గా సిద్దార్థరాయ్ కపూర్ హీరోగా మహేష్ భట్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సడక్ 2’ చిత్రం ట్రైలర్ డిస్ లైక్స్ విషయంలో ప్రపంచ రికార్డును సొంతం చేసుకుంది. ఆ చిత్రం ట్రైలర్ వ్యూస్ తో పాటు డిస్ లైక్స్ కూడా భారీ ఎత్తున పెరుగుతున్నాయి. కోటి దాటేలా డిస్ లైక్స్ పెరుగుతూనే ఉన్నాయి. ఇదంతా కూడా సుశాంత్ మరణం ఎఫెక్ట్ అనే విషయం తెల్సిందే. సుశాంత్ మరణంకు నెపొటిజం కారణం అంటూ చాలా మంది బలంగా నమ్ముతున్నారు.
ఆలియా భట్ వంటి చాలా మంది స్టార్స్ కేవలం నెపొటిజం కారణంగానే ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. సుశాంత్ వంటి చాలా మంది కూడా నెపొటిజం వల్లే అవకాశాలు దక్కించుకోలేక డిప్రెషన్ కు గురై కొందరు ఆత్మహత్య వరకు వెళ్తున్నారు. ఈ కారణంగానే చాలా మంది నెపొటిజంకు వ్యతిరేకంగా ఏకంగా ఉద్యమంనే మొదలు పెట్టారు. అందులో భాగంగానే ఆలియా నటించిన సడక్ 2 చిత్రానికి చెత్త ప్రపంచ రికార్డును నెటిజన్స్ కట్టబెట్టారు. ఇదే పరిస్థితి మన రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రానికి కూడా పట్టనుందా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఆర్‌ఆర్‌ఆర్ చిత్రంలో ఆలియా భట్ ఉండటం వల్ల ఉత్తరాదిన ఖచ్చితంగా ప్రభావం ఉంటుందని ఎక్కువ మంది అనుకుంటున్నారు. అయితే ఆర్‌ఆర్‌ఆర్ చిత్రం రావడానికి ఇంకా ఏడాది అయినా పడుతుంది. కనుక అప్పటి వరకు పరిస్థితులు చాలా మారే అవకాశం ఉంది. అలాగే సడక్ 2 మరియు ఆర్‌ఆర్‌ఆర్ చిత్రాలకు అసలు పోలికే లేదు. ఎందుకంటే సుశాంత్ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా చక్రవర్తి కి సడక్ 2 చిత్ర దర్శకుడు మహేష్ భట్ ఏదో కారణం వల్ల సాయం చేస్తున్నాడు అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ కారణంగా సడక్ 2 చిత్రంకు ఎక్కువగా నెగిటివిటీ ఎదురవుతుంది.
ఆలియా భట్ ఆర్‌ఆర్‌ఆర్ చిత్రంలో ఉన్నా కూడా జక్కన్న దర్శకత్వం వహించడంతో పాటు అజయ్ దేవగన్ వంటి స్టార్ నటించడం వల్ల ఖచ్చితంగా ఆ సమయంకు ఈ సినిమాకు ఎలాంటి నెగిటివిటీ ఎదురయ్యే అవకాశం లేదనిపిస్తుంది. సమయం ఇంకా చాలా ఉంది కనుక అప్పటి వరకు ఏం జరుగుతుందో చూడాలి.