త‌ల్లులు కాబోతున్న క్రేజీ భామ‌లు వీళ్లే!

Update: 2022-04-13 23:30 GMT
మాతృమూర్తి అవ్వ‌డం అన్న‌ది ఓ గొప్ప వ‌రం.  మ‌హిళ‌కి  దేవుడిచ్చే గొప్ప బ‌హుమానం అంత‌క‌న్నా ఏముంటుంది?  పెళ్లైన‌ ప్ర‌తీ మ‌హిళ తల్లి అవ్వాల‌ని  ఆ గ‌డియ‌లు కోసం ఎంతో ఉత్సాహంతో ఎదురు చూస్తున్నారు. పెగు తెంచుకుని పుట్టిన బిడ్డ‌ని చూసుకోవాల‌ని ఎంతో ఆరాటం చూపిస్తారు. త‌ల్లైన ఆ మధుర క్ష‌ణాల్ని మాట‌ల్లో వ‌ర్ణించ‌డం ఎవ‌రికి సాధ్యం.

ప్ర‌స్తుతం కొంత మంది హీరోయిన్లు అదే ఉత్సాహంతో త‌ల్లిగా పాపాయిల‌కు జ‌న్మ‌నివ్వ‌డానికి నిండు గ‌ర్భీణీలుగా రెడీగా ఉన్నారు. సోష‌ల్ మీడియా వేదిక‌గా బేబి బంప్ ఫోటోల్ని అభిమానుల‌కు షేర్ చేసి సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. త‌ల్లి కాబోతున్న ఆ క్రేజీ భామ‌ల గురంచి ఓ లుక్ ఏస్తే...

గౌత‌మ్ కిచ్లూని వివాహం చేసుకుని కాజ‌ల్ అగ‌ర్వాల్ ఓ ఇంటిదైన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఆమె  నిండు గ‌ర్భిణి. నెల‌లు స‌మీపిస్తున్నాయి. మేలోనే కాజ‌ల్ త‌ల్లి కానుంది. ఇప్ప‌టికే బేబి బంప్ ఫోటోలు ఇన్ స్టా వేదిక‌గా ఎప్ప‌టిక‌ప్పుడు షేర్ చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. అలాగే  బాలీవుడ్ హీరోయిన్ సోన‌మ్ క‌పూర్- ఆనంద్ ఆహుజాని వివాహం చేసుకుని త‌ల్లిగా ప్ర‌మోట్ అవుతుంది. ఆగ‌స్టు లో ఆమె పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌నుంది. బేబి బంప్ ఫోటోలు అభిమానుల‌తో పంచుకుంటోన్న సంగ‌తి తెలిసిందే.

ఇక హీరోయిన్ గా కొన్ని సినిమాల్లో న‌టించిన ప్ర‌ణీత‌- నితిన్ రాజ్ ని ప్రేమ వివాహం చేసుకుంది. గ‌ర్భం దాల్చిన విష‌యాన్ని ఇటీవ‌లే  తెలిపింది. దానికి సంబంధించిన స్కానింగ్ రిపోర్ట్ ని సైతం బ‌య‌ట‌పెట్టింది. అంటే ప్ర‌ణీత త‌ల్లి అవ్వ‌డానికి ఎంత ఉత్సాహం చూపిస్తుందో ఆ స‌న్నివేశ‌మే బ‌య‌ట పెడుతుంది. ఇక టీవి న‌టి న‌టాషా శ‌ర్మా రెడ్డి కూడా తల్లి కాబోతుంది. ఇటీవ‌లే ఆమె గ‌ర్భంతో ఉన్న ఫోటోల్ని షేర్ చేసింది.

'బిగ్ బాస్' ఫేం డింపు ల్ గంగూలీ ఉత్త‌రాది ఆడియ‌న్స్ కి సుప‌రిచితురాలే. ఆమె మూడో బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌బోతుంది. ఇప్ప‌టికే ఆమెకు పాప‌..బాబు క‌ల‌రు. అలాగే విన్ని అరోరా- దీర‌జ్ దూప‌ర్ జంట కూడా ఫాద‌ర్..మ‌ద‌ర్ కాబ‌తున్నారు. త‌మ బిడ్డ గురించి ఇటీవ‌లే రివీల్ చేసిందీ జంట‌. అలాగే భార‌తీ సింగ్- హ‌ర్ష లిబాచియా దంప‌తులు రెండో బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌బోతున్నారు. ఇప్ప‌టికే బాబు క‌ల‌డు.

అలాగే బాలీవుడ్ న‌టి క్ర‌తిక సెంగార్ కూడా గ‌ర్భందాల్చింది. ఆమె భ‌ర్త నికేథ‌ర్ ధీర్. 'కంచె' సినిమాలో న‌టించాడు.   మోహెనా కుమారి- సుయేష్ రావ‌త్ దంప‌తులు కూడా  అమ్మ నాన్న‌లు కానున్నారు. ఇటీవ‌లే మెహానా గ‌ర్భంతో ఉన్న ఫోటోల్ని షేర్ చేసింది. అలాగే 'కుంకుమ భాగ్య' సీరియ‌ల్ న‌టి పూజా బెన‌ర్జీ కూడా త‌ల్లి  కాబోతుంది.

ఆమె బేబి బంప్ ఫోటోలు షేర్ చేసింది. పాకిస్తాన్ మోడ‌ల్ సారాఖాన్ కూడా అమ్మ‌గా ప్ర‌మోట్ అవుతుంది. అలాగే మ‌రో టెలివిజ‌న్ న‌టి దెబినా బెన‌ర్జీ కూడా మాతృమూర్తి కాబోతుంది. ఇలా బాలీవుడ్ సెల‌బ్రిటీలు త‌ల్లుగా ప్ర‌మోట్ అవుతున్నారు.
Tags:    

Similar News