ఈ ఏడాది సినీ పరిశ్రమ నంతటిని శోక సముద్రంలో ముంచుతూ తిరిగిరాని లోకానికి వెళ్లారు కొందరు సినీ ప్రముఖులు. అందులో సూపర్ స్టార్ కృష్ణ, రెబల్ స్టార్ కృష్ణం రాజు పాటుగా దర్శకుడు శరత్ హీరో కమ్ ప్రొడ్యూసర్ రమేష్ బాబు, కైకాల సత్యనారాయణ కూడా ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. వారు సినిమాలతో.. వారి ప్రతిభతో తెలుగు ప్రేక్షకులను అలరించారు. భౌతికంగా మన మధ్య లేకున్నా సరే వారు చేసిన సినిమాలు ఎప్పటికీ మనలోనే.. మనతోనే ఉంటాయి.
ఈ ఇయర్ జనవరి 3న తెలుగు చలన చిత్ర దర్శకుడు పి.చంద్రశేఖర్ రెడ్డి మృతి చెందారు. అనారోగ్య సమస్యల వల్ల ఆయన తుది శ్వాస విడిచారు.
ఈ ఏడాది జనవరి 8న సూపర్ స్టార్ కృష్ణ పెద్ద తనయుడు రమేష్ బాబు అనారోగ్య కారణాల వల్ల మృతి చెందారు. రమేష్ బాబు మరణం కృష్ణ కి చాలా బాధ కలిగించింది. అసలైతే తన తర్వాత రమేష్ ని స్టార్ ని చేయాలని అనుకున్నారు కృష్ణ. కానీ రమేష్ బాబు సినిమాల్లో రాణించలేకపోయారు. ఆ తర్వాత మహేష్ మొదటి సినిమా నుంచే ప్రేక్షకుల్లో మంచి ఆదరణ సంపాదించారు. ఘట్టమనేని ఫ్యాన్స్ కూడా మహేష్ కి సూపర్ సపోర్ట్ గా నిలిచారు.
జనవరిలోనే 19న అనారోగ్య కారణంగా కొంచాడ శ్రీనివాస్ కూడా తుదిశ్వాస విడిచారు. నటుడిగా తనని తాను ప్రూవ్ చేసుకుంటూ ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఆయన మృతి చెందడం తోటి కళాకారులని శోక సముద్రంలో ముంచెత్తింది.
ఈ ఇయర్ మార్చి 12న లిరిసిస్ట్ కందికొండ యాదగిరి తుదిశ్వాస విడిచారు. త్రోట్ క్యాన్సర్ తో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇదే రోజు మ్యూజిక్ డైరెక్టర్ ఈశ్వర్ రావు కూడా అనారోగ్య కారణంగా మృతి చెందారు. ఈయన ప్రముఖ సంగీత దర్శకుడు ఎ కోదండపాణి తనయుడు. సినిమాలతో పాటుగా సీరియల్స్ కు ఎక్కువ సంగీతం అందించారు ఈశ్వర్ రావు.
ఈ ఇయర్ ఏప్రిల్ 1న డైరక్టర్ శరత్ కూడా అనారోగ్య కారణాల వల్ల తుది శ్వాస విడిచారు. దాదాపు 20 సినిమాల దాకా చేసిన ఆయన బాలకృష్ణ, సుమన్ లతో సూపర్ హిట్లు ఇచ్చారు. 1986లో వచ్చిన చాదస్తపు మొగుడు సినిమాతో డైరెక్టర్ గా మారిన శరత్ బాలకృష్ణతో వంశానికొక్కడు, సుల్తాన్, పెద్దన్నయ్య, వంశోద్ధారకుడు సినిమాలు చేశారు. సుమన్ తో కూడా బావా బామ్మర్ధి, పెద్దింటి అల్లుడు, చిన్న అల్లుడు లాంటి హిట్ సినిమాలు తీశారు.
ఇదే ఏడాది ఏప్రిల్ 9న సీనియర్ యాక్టర్ బాలయ్య కన్నుమూశారు. 1958 లో ఆయన నటుడిగా తొలిసారి కెమెరా ముందుకు వచ్చారు. అప్పటి నుంచి 2013 వరకు ఆయన సినిమాలు చేస్తూనే వచ్చారు. కేవలం నటుడిగానే కాదు నిర్మాతగా, దర్శకుడిగా కూడా బాలయ్య తన ప్రతిభ చాటారు. పరిశ్రమలో తనకంటూ ఒక మంచి పేరు సంపాదించుకున్నారు ఎం. బాలయ్య.
ఏప్రిల్ 20న ప్రముఖ దర్శకుడు తాతినేని రామారావు కూడా ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. తెలుగులోనే కాదు హిందీలో కూడా ఆయన సినిమాలను డైరెక్ట్ చేశారు. సినిమాలు డైరెక్ట్ చేయడమే కాదు నిర్మాతగా కూడా తెలుగుతో పాటుగా తమిళ, హిందీ సినిమాలు నిర్మించారు తాతినేని రామారావు.
వెండితెర రెబల్ స్టార్ కృష్ణం రాజు ఈ ఏడాది సెప్టెంబర్ 11న తుది శ్వాస విడిచారు. రాధే శ్యాం ఈవెంట్ టైం లోనే ఆయన హెల్త్ సరిగా లేదని అనిపించింది. అదే ఆయన చివరి ఫ్యాన్ మీట్. కృష్ణం రాజు మరణం సినీ పరిశ్రమకు చాలా పెద్ద నష్టం. ఆయన తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ సినీ ప్రముఖులంతా కూడా నివాళి అర్పించారు.
నవంబర్ 15న సూపర్ స్టార్ కృష్ణ తుది శ్వాస విడిచారు. తెలుగు పరిశ్రమకు ఎన్నో కొత్త సాంకేతిక ని పరిచయం చేశారు కృష్ణ. ప్రయోగాలకు ఎప్పుడూ ముందుండే సూపర్ స్టార్ కృష్ణ తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక చెరిగిపోని ముద్ర వేసుకున్నారు. కృష్ణ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో అల్లూరి సీతారామరాజు గా ఎప్పటికీ నిలిచి ఉంటారు.
ఈ ఇయర్ ఎండింగ్ లో మరో సినీ ఆణిముత్యం ఈ లోకాన్ని విడిచి వెళ్లింది. దిగ్గజ నటుడు కైకాల సత్యనారాయణ ని సినీ పరిశ్రమ కోల్పోయింది. కొన్నాళ్లుగా వయసు రీత్యా వస్తున్న అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన డిసెంబర్ 23న తుది శ్వాస విడిచారు. ఆయన చేసిన పాత్రలు గుర్తు చేసుకుంటూ ఆయనతో ఉన్న అనుభవాలను నెమరేసుకుంటూ సినీ ప్రముఖులంతా ఆయనకు నివాళి అర్పించారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.