ఇండస్ట్రీలో ప్రధానంగా ఏ సమస్య వచ్చినా ఆ నలుగురు అనే ట్యాగ్ వినిపిస్తూ వుంటుంది. ఆ నాలుగు కుటుంబాలే సినిమాని శాసిస్తున్నాయని, ఆ నాలుగు కుటుంబాలే బిగతా వాళ్లని తొక్కేస్తున్నాయనే భారీ డైలాగ్ లు వినిపిస్తుంటాయి. నెపోటిజమ్ కూడా ఇండస్ట్రీలో రాజ్యమేలుతోందని కూడా కొంత కాలం వార్తలు వినిపించాయి. అయితే తాజాగా మాత్రం ఐదు ఫ్యామిలీల గురించి ఇండస్ట్రీలోనూ, అభిమానుల్లోనూ ఆసక్తికర చర్చ జరుగుతోంది.
మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ, అక్కినేని ఫ్యామిలీ, దగ్గుబాటి ఫ్యామిలీ.. ఈ ఐదు ఫ్యామిలీలకు ప్రత్యేక గుర్తింపు వున్న విషయం తెలిసిందే. ఇప్పడు హవా మొత్తం ఈ ఐదు ఫ్యామిలీలదే. అయితే ఇందులో రెండు ఫ్యామిలీలు మాత్రమే టాప్ లో కొనసాగుతున్నాయి. అవే మెగా కాంపౌండ్ కు చెందిన మెగా ఫ్యామిలీ.. అల్లు ఫ్యామిలీ.. ఈ రెండు ఫ్యామిలీలు నంబర్ వన్ రేస్ లో వున్నాయి. నందమూరి ఫ్యామిలీ థర్డ్ ప్లేస్ లో కొనసాగుతోంది. దగ్గుబాటి ఫ్యామిలీ 4వ ప్లేస్ ని ఆక్రమించింది. ఇక లాస్ట్ ప్లేస్ లో అక్కినేని ఫ్యామిలీ నిలిచింది.
మెగా ఫ్యామిలీలో మెగాస్టార్ తో సహా ఏడుగురు హీరోలు ఫామ్ లో వున్నారు. ఇందులో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఫామ్ ని ప్రదర్శిస్తున్నారు. ఈయన చేతిలో ఇప్పుడు వరుసగా ఆచార్య, గాడ్ ఫాదర్, భోళా శంకర్, రవీంద్ర బాబి సినిమా, వెంకీ కుడుముల చిత్రం.. ఇలా ఐదు చిత్రాలని లైన్‌లో పెట్టారు. ఇక పవన్ కల్యాణ్ కూడా భారీ లైనప్ నే సిద్ధం చేసుకున్నారు. భీమ్లా నాయక్, హరి హర వీరమల్లు, భవదీయుడు భగత్ సింగ్ చిత్రాల్లో నటిస్తున్నారు. రామ్ చరణ్ `ఆచార్య`, ఆర్ ఆర్ ఆర్, శంకర్ మూవీ, గౌతమ్ తిన్ననూరి చిత్రం.. వరుణ్ తేజ్ ఎఫ్3, గని, సాయి ధరమ్ తేజ్ ఒకే ఒక్క సినిమాతో ట్రాక్ లో వున్నాడు. పంజా వైష్ణవ్ తేజ్ రంగ రంగ వైభవంగ చిత్రంతో పాటు అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తున్న చిత్రంలోనూ నటిస్తున్నారు.
ఇక అల్లు వారి ఫ్యామిలీ హీరోల గురించి చెప్పాలంటే బన్నీ ఇప్పటికే `పుష్ప` హిట్ తో పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. ప్రస్తుతం ఈ మూవీ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న బన్నీ త్వరలో `పుష్ప -2` ని ప్రారంభించబోతున్నాడు. ఇది కూడా పాన్ ఇండియా లెవెల్లో రికార్డులు సృష్టించబోతోంది. ఈ మూవీ తరువాత బోయపాటి శ్రీను, అట్లీ కుమార్ తో ఓ సినిమా చేయబోతున్నాడు. అల్లు శిరీష్ మాత్రం `ప్రేమ కాదంట` చిత్రంలో నటిస్తున్నాడు. అల్లు అరవింద్ ఓ పక్క సినిమాలు నిర్మిస్తూనే ఆహా ఓటీటీతో దూసుకుపోతున్నారు. ఇలా ఐదు క్రేజీ ఫ్యామిలీలలో మెగా, అల్లు ఫ్యామిలీస్ మొదటి స్థానంలో నిలిచారు.
వీరి తరువాత స్థానంలో నందమూరి ఫ్యామిలీ నిలుస్తోంది. బాలకృష్ణ రీసెంట్ గా `అఖండ`తో ఫామ్‌లోకి వచ్చేశారు. అంతే కాకుండా అన్ స్టాపబుల్ టాక్ షోతో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యారు. ఆ వెంటనే గోపీచంద్ మలినేని తో సినిమా చేస్తున్నారు. ఎన్టీఆర్ `ఆర్ ఆర్ ఆర్` తో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఈ మూవీ తరువాత వెంటనే కొరటాల శివతో సినిమాకు రెడీ అయిపోతున్నారు. ఈ మూడు ఫ్యామిలీల తరువాతి స్థానాల్లో దగ్గుబాటి ఫ్యామిలీ నిలవగా చివరి ప్లేస్ లో అక్కినేని ఫ్యామిలీ నిలిచింది.
దగ్గుబాటి ఫ్యామిలీ హీరో వెంకటేష్ గత ఏడాది నారప్ప, దృశ్యం 2 చిత్రాలతో సక్సెస్ లు సాధిస్తే రానా `విరాట పర్వం`తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇక అక్కినేని ఫ్యామిలీ హీరోలు ఈ ఏడాది `బంగార్రాజు`తో సక్సెస్ సాధించినా రేసులో ఇంకా వెనకబడే వున్నారు. ఈ ఐదు ఫ్యామిలీ హీరోల లిస్టే భారీ స్థాయిలో వుంటే ఇండస్ట్రీలో ఎలాంటి సపోర్ట్ లేని హీరోలు నిలబడటం కష్టమే అంటున్నారు. వారసత్వానికే అత్యధికంగా పట్టంకడుతుండటం, వారికే అవకాశాలు వస్తుండటంతో అభిమానులు కూడా వారసత్వ హీరోల గురించి ప్రత్యేకంగా చర్చించుకుంటున్నారు.
అయితే వీరితో పోటీ పడి మరీ విజయ్ దేవరకొండ లాంటి హీరోలు స్టార్ లుగా ఎదగడంతో వారసత్వ ఆలోచనల్లో నిజం లేదని స్పష్టమవుతోంది. ఫ్యామిలీల అండతో అవకాశాలు దక్కినా టాలెంట్ లేకపోతే ఇక్కడ నిలబడటం కష్టం కదా? అని అభిమానులు నెపోటిజమ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. నిజమే వారసులుగా ఇండస్ట్రీలో ఈజీగా అవకాశాలు దక్కించుకున్నా ఆకట్టుకోలేకపోతే నిలబడటం కష్టమన్నది ఇప్పటి వరకు చాలా మంది హీరోలు నిరూపించారు కూడా. ఇదే వాదన ఇప్పుడు అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది.