సౌత్ సినిమాలు వసూళ్లు మరియు పారితోషికాల విషయంలో బాలీవుడ్ సినిమాలకు గట్టి పోటీ ఇస్తున్నాయి. ముఖ్యంగా తెలుగు మరియు తమిళ సినిమాలు భారీ బడ్జెట్ తో పాటు మంచి కాన్సెప్ట్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఇటీవల కాలంలో తెలుగు లో వచ్చిన చాలా సినిమాలు హిందీలో రీమేక్ అవుతున్నాయి. ఇక తమిళ సినిమాలతో పోల్చితే తెలుగు సినిమాల ప్రమోషన్స్ భారీ గా ఉంటాయి. స్టార్ హీరోల తమిళ సినిమాలకు కూడా అంతగా ప్రమోషన్స్ చేసే దాఖలాలు ఉండవు.
ప్రమోషన్ విషయంలో తమిల మేక్స్ ఇంకాస్త వెనుక పడి ఉన్నారు అనడంలో సందేహం లేదు. వారి పెద్ద సినిమాల ప్రమోషన్స్ కూడా మన చిన్న సినిమాల ప్రమోషన్స్ కు సాటి రావు అనేది ఒక వాదన ఉంది. టాలీవుడ్ మేకర్స్ ప్రమోషన్స్ కు భారీగా ఖర్చు పెడతారు. బడ్జెట్ లో కొంత మొత్తంను తెలుగు నిర్మాతలు కేటాయించి మరీ ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తారు.
భారీ ఎత్తున ప్రమోషన్స్ చేసిన తర్వాతే సినిమాకు వచ్చిన బజ్ నేపథ్యంలో సినిమా బిజినెస్ చేస్తారు. కాని తమిళ మేకర్స్ మాత్రం షూటింగ్ ప్రారంభం అయిన సమయంలోనే బిజినెస్ మొదలు పెడతారు అనే టాక్ ఉంది. పెద్ద హీరోల సినిమాలు కూడా మొదలు అయిన సమయంలోనే బిజినెస్ లు జరుగుతాయి. తమిళంలో రూపొందిన పలు సినిమాలు తెలుగులో విడుదల అవుతున్నాయి. కాని వాటిలో ఎక్కువ శాతం ప్లాప్ అవుతున్నాయి. ఇక్కడ ప్రమోషన్ విషయంలో వారు పెద్దగా ఆసక్తి చూపించరు. దాంతో సినిమాల గురించి జనాలు పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదు.
తెలుగు భారీ సినిమాల ప్రమోషన్స్ ను విడుదలకు రెండు మూడు నెలల ముందు నుండే ప్రచారం పబ్లిసిటీ మొదలు పెడతారు. పబ్లిసిటీ కారణంగా సినిమాలపై ప్రేక్షకుల్లో అంచనాలు మరింతగా పెరగడం వల్ల బిజినెస్ మరింత ఎక్కువ అవుతుంది. టాలీవుడ్ నిర్మాతలు సినిమా బజ్ ఆధారంగా ఏరియాల వారిగా రేట్లు నిర్ణయిస్తారనే టాక్ ఉంది. చిన్న సినిమా అయినా కూడా బజ్ ఆధారంగా పెద్ద మొత్తాలకు అమ్ముడు పోయిన సినిమాలు చాలా ఉన్నాయి.
సినిమా విడుదల తర్వాత కూడా మన వాళ్లు ప్రమోషన్ విషయంలో లైట్ తీసుకోరు. కాని తమిళ ఇండస్ట్రీ లో మాత్రం పెద్దగా పబ్లిసిటీ వేడుకలు కనిపించవు. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ సినిమాల ప్రమోషన్స్ కూడా భారీగా ఉంటాయి. టాలీవుడ్ మరియు బాలీవుడ్ సినిమాల ప్రమోషన్స్ తో పోల్చితే తమిళ సినిమా ప్రమోషన్స్ చాలా పూర్ గా ఉంటాయని విశ్లేషకుల మాట. ముందు ముందు అయిన తమిళ సినిమా పరిశ్రమ పబ్లిసిటీ విషయంలో మరింత దృష్టి పెడుతుందేమో చూడాలి.