పాన్ ఇండియా స్టార్ అనే అంశంపై ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో జరుగుతోన్న చర్చ గురించి తెలిసిందే. 'బాహుబలి' ప్రాంచైజీతో ప్రభాస్..'కేజీఎఫ్' ప్రాంచైజీ తో యశ్..'పుష్ప' ప్రాంచైజీతో అల్లు అర్జున్..'ఆర్ ఆర్ ఆర్ 'తో రామ్ చరణ్..ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్లుగా అవతరించడమే ఈ చర్చకు దారి తీసింది. ముగ్గురు హీరోలు నటించిన సినిమాలు అన్ని భాషల్లో రిలీజ్ అవ్వడం..సక్సెస్ అవ్వడంతో దేశ వ్యాప్తంగా ఒక్కసారిగా ఫేమస్ అయ్యారు.
పాన్ ఇండియా క్రేజ్ ఒక్క సినిమాతో ఓవర్ నైట్ లో దక్కించుకోవడం చర్చనీయాంశమైంది. ఆ చిత్రాలతో దర్శకులకు అదే స్థాయిలో పేరొచ్చింది. అయితే నటుడు సిద్దార్ధ్ సహా కొంత మంది బాలీవుడ్ దర్శక-హీరోలు..కోలీవుడ్ నటులు పాన్ ఇండియా సినిమాలు..పాన్ ఇండియా స్టార్లు ఇప్పుడు కాదు! దశాబ్ధాల క్రితమే పుట్టారని చెప్పుకొచ్చారు.
'రోజా'..'బొంబాయి' లాంటి సినిమాలో మణిరత్నం.. దేశం గర్వించదగ్గ దర్శకుడు శంకర్... విశ్వనటుడు కమల్ హాసన్.. రజనీకాంత్.. అరవింద్ స్వామి..మాధవన్ లాంటి నటులు చాలా కాలం క్రితమే పాన్ ఇండియా స్టార్లు అయ్యారని అన్నారు. కొంత మంది బాలీవుడ్ ఉద్దండులు సైతం పాన్ ఇండియా పై సెటైరికల్ గాను స్పందించారు.
అయితే పాన్ ఇండియా స్టార్లకు అసలైన మీనింగ్ ని ఇప్పుడు స్టార్ హీరో మాధవన్ ఎంతో చక్కగా విశ్లేషించారు. అతని విశ్లేషణలో వాస్తవం కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది. పాన్ ఇండియా అంశం మాధవన్ ముందుకెళ్తే? ఆయన ఏమన్నారంటే?...'' నేను ముంబైలో పుట్టి పెఓరిగాను. అక్కడ హిందీ సిరియల్స్ చేసాను. ఆ తర్వాత సినిమాలు చేసాను.
హిందీ భాష బాగా తెలుసు. నేను హిందీ సినిమాలు చేయడం పెద్ద విషయం కాదు. కానీ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప' సినిమా మినహా ఏదీ హిందీలో డబ్ అవ్వలేదు. కానీ అతని సినిమాలు దేశ వ్యాప్తంగా అన్ని నగరాల్లో ఆడుతాయి. ప్రభాస్..రానా..మహేష్ సర్ లాంటి నటులకు దేశ వ్యాప్తంగా అభిమానులున్నారు. క్రేజ్ ఉంది.
వాళ్ల సినిమాలకు ఎక్కువ కలెక్షన్స్ వస్తుంటాయి. ఇంకా చెప్పాలంటే వీళ్లంతా కమల్ హాసన్..చిరంజీవి కంటే ఎక్కువ పాపులర్ అయినవారు అని నర్మగర్భంగా'' చెప్పారు. సీనియర్- జూనియర్ అనే బేధాన్ని పక్కనబెడితే! అసలైన వాస్తవం మాధవన్ మాటల్లో బయటపడింది. దేశ వ్యాప్తంగా అభిమానులు కల్గిన ప్రతీ నటుడు పాన్ ఇండియా స్టార్ అన్నది మాధవన్ అభిప్రాయంగా కనిపిస్తుంది. నిజంగా ఓ వేదికపై ఇలాంటి వ్యాఖ్యలు చేయాలంటే గట్స్ ఉండాలి. మాధవన్ ఆ విషయంలో గ్రేట్.