సినిమా విడుదల తర్వాత కలపడాలు, తీసివేతల వ్యవహారాలు ఇటీవల ఎక్కువగా జరుగుతున్నాయి. సినిమాకి మిక్స్ డ్ రెస్పాన్స్ వచ్చిందని తెలియగానే అందులో ఏమేం లోటుపాట్లున్నాయో గమనిస్తుంటారు. ల్యాగ్ గా ఉన్నట్టనిపిస్తేనో లేదంటే ఆ సన్నివేశాలతో పెద్దగా ప్రయోజనం లేదనిపిస్తేనో వెంటనే వాటిని కట్ చేస్తుంటారు. ట్రిమ్ వెర్షన్ లో సినిమా బాగుందని, కావాలంటే ఇప్పుడు చూడండని ప్రచారం చేస్తుంటారు. అదే ఒక సినిమా హిట్టయిందనుకోండి. దానికి మరిన్ని వసూళ్లు రావాలని, ప్రేక్షకులు రిపీటెడ్ గా సినిమాని చూడాలనే ఉద్దేశంతో కొత్త సన్నివేశాల్ని కలుపుతుంటారు. కొన్ని కారణాలవల్ల మొదట్లో చాలా ముఖ్యమైన సన్నివేశాల్ని తొలగించామని, ఇటీవల మళ్లీ వాటిని కలపడంతో సినిమాకి ఇంకా కళ పెరిగిందని ప్రచారం చేసుకొంటుంటారు. వాటివల్ల కలిగే ఫలితం తక్కువే అయినా నిర్మాతలవైపు నుంచి చేయాల్సిందంతా చేసేస్తుంటారు.
తాజాగా తిక్క సినిమా విషయంలోనూ తీసివేతల వ్యవహారం జరుగుతోంది. నిన్ననే విడుదలైన ఆ సినిమాకి మిక్స్ డ్ టాక్ రావడం, కొన్ని సీన్లు లాగింగ్ గా చాలా బోరింగ్‌గా ఉన్నాయని ప్రేక్షకులు పెదవి విరచడంతో పది నిమిషాల కోత వేశారు. ఫస్ట్ హాఫ్‌లో ఐదు నిమిషాలు, సెకండ్ హాఫ్ లో ఐదు నిమిషాల సన్నివేశాల్ని కట్ చేసి కొత్త వెర్షన్ ని ప్రదర్శించే ఏర్పాట్లు చేశారు. మరి ఈ ప్రయత్నం సినిమాకి ఎంత వరకు మేలు చేస్తాయో చూడాలి. సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా సునీల్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమే తిక్క.