ఆ చెప్తారు మరీ.. అసలు టీజర్ అంటే అర్థమే అది కదా. ఏదో చెప్పినట్టే అనిపించేలా... అసలేమీ చెప్పలేదనిపించేలా సినిమాపై ఆసక్తి రేకెత్తించేదే టీజర్. ఆ సూత్రాన్ని పక్కాగా ఫాలో అయ్యాడు మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్. ఆయన కథానాయకుడిగా నటించిన తిక్క టీజర్ కొద్దిసేపటి క్రితమే విడుదలైంది. టీజర్ లో కథ చెప్పినా, చెప్పకపోయినా హీరోని మాత్రం స్టైలిష్ గా - హీరోయిజం ఉట్టిపడేలా చూపిస్తుంటారు. కానీ తిక్కలో మాత్రం డిఫరెంట్ గా చూపించారు. జగమే మాయ అనే పాట బ్యాక్ గ్రౌండ్ లో వినిపిస్తుండగా వచ్చే ఓ యాక్సిడెంట్ సీన్ లో సాయిధరమ్ తేజ్ కనిపిస్తాడు. ఆ తర్వాత `నువ్వు ఒక్క మాట అడిగి చూడు... హీరో ఏంటి? టెర్రరిస్టు కూడా అయిపోతాను` అనే డైలాగ్ చెబుతాడు తేజ్.
అయితే ఎవరు ఎవర్ని అడగాలో, ఏం అడగాలో మాత్రం తెలీలేదు. బహుశా అమ్మాయే అడగాల్సి వుంటుంది. అయితే తాగుబోతు రమేష్ చెప్పే డైలాగులు మాత్రం ఇది ప్రేమకథ అనే విషయం స్పష్టం చేస్తుంటుంది. ``ప్రేమ బబుల్ గమ్ భయ్యా... మొదట తియ్యగా ఉంటుంది, ఆ తర్వాత చప్పగా మారుతుంది. దోస్తాన్ లు అలా కాదు, చాక్లెట్ లా ఎప్పుడూ తియ్యగా ఉంటారు`` అంటూ తాగుబోతు రమేష్ చెప్పిన డైలాగ్ లు పేలాయి. టీజర్ పూర్తయ్యేలోపు ఇంకా ఏమైనా కథ గురించి తెలుస్తుందేమో అని చూస్తే సాయిధరమ్ తేజ్ మాత్రం ``బారు బారు దేఖో... బీరు కొట్టి దేఖో`` అంటూ థియేటర్లోకి రమ్మన్నాడు. సునీల్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 13న ప్రేక్షకుల ముందుకొస్తోంది.
Full View