మహేష్ కొడుకు హీరోగా వచ్చేస్తున్నాడు

Update: 2018-03-01 14:27 GMT
మహేష్ బాబు కొడుకు అంటే గౌతమ్ కృష్ణ ఇంకా టీనేజరే అనే సంగతి తెలిసిందే. అయితే.. అన్న కొడుకు అయినా కొడుకే అనే విషయం తెలిసిందే. అలా మహేష్ అన్న రమేష్ బాబు కుమారుడు తెరంగేట్రం చేసేందుకు సిద్ధమవుతున్నాడు.

రమేష్ బాబు కూడా ఒకప్పుడు టాలీవుడ్ హీరోనే. మహేష్ కంటే ముందే హీరోగా చాలా సినిమాలు చేశాడు. మొదట కొన్ని సినిమాలు బాగానే ఆడినా.. తర్వాత వరుస ఫెయిల్యూర్స్ తో హీరో పాత్రలకు దూరం అయినా.. అడపాదడపా సినిమాలు నిర్మిస్తూ ఇండస్ట్రీలోనే ఉంటున్నాడు. ఇప్పుడు రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ తెలుగు సినిమా రంగంలో అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నాడు. సత్యానంద్ దగ్గర ఇప్పటికే నటనలో శిక్షణ తీసుకుంటున్నాడు కూడా. వైజాగ్ లో కొంతకాలంగా ఉంటూ.. యాక్టింగ్ కోర్స్ కంప్లీట్ చేస్తున్నాడట.

తాత ఒక సూపర్ స్టార్.. బాబాయ్ మరో సూపర్ స్టార్.. వీరిద్దరి వారసత్వంతో ఇండస్ట్రీలోకి వస్తున్న జయకృష్ణపై.. కృష్ణ అభిమానుల్లో కూడా కొంతమేర అంచనాలు ఏర్పడ్డాయి. సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి చాలామందే ఇండస్ట్రీలోకి వచ్చారు. కానీ మహేష్ తప్ప ఎవరూ క్లిక్ కాలేదు. మహేష్ సూపర్ స్టార్ గా ఎదిగిన తర్వాత కూడా ఈ ట్రెండ్ కంటిన్యూ అయింది కానీ.. ఆ స్థాయిలో కొంతవంతుకు కూడా చేరుకోలేకపోయారు. మరి జయకృష్ణ ఏం చేస్తాడో చూడాలి.
Tags:    

Similar News