మజ్నుకి మరో అమ్మాయి కావాలి

Update: 2015-11-17 04:09 GMT
అక్కినేని వారసుడు నాగ చైతన్య కొత్త సినిమాకి సిద్ధం అవుతున్నాడు. ప్రస్తుతం గౌతమ్ మీనన్ తో చేస్తున్న సాహసం శ్వాసగా సాగిపో చిత్రీకరణ పూర్తయిపోయింది. మిగిలిన వర్క్స్ కి యూనిట్ రెడీ అవుతుంటే.. చైతూ మాత్రం నెక్ట్స్ వెంచర్ పై దృష్టి పెట్టేశాడు. మళయాళ ప్రేమమ్ రీమేక్  ని పట్టాలెక్కిస్తున్నడు నాగ చైతన్య.

తెలుగులో మజ్ను పేరుతో రూపొందనున్న ఈ సినిమాకి చందు మొండేటి డైరెక్టర్. స్టోరీ పరంగా ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ ఉంటారు. హీరో తన జీవితంలోని మూడు స్థాయిల్లో ముగ్గురు అమ్మాయిలతో లవ్ లో పడతాడు. అందులో ఒక రోల్ ని మళయాళ సుందరి అనుపమా పరమేశ్వరన్ చేస్తోంది. మళయాళంలో కూడా ఈ పాత్రను ఇదే భామ చేసింది. ఇక రెండో రోల్ లెక్చరర్. ఈ పాత్ర కోసం శృతి హాసన్ ని ఫైనల్ చేశారు. ఇక నెక్ట్స్ కీలకమైన మూడో హీరోయిన్ ఎవరు అనే ?
 
డిసెంబర్ 1 నుండి షూటింగ్ ప్రారంభం కానున్న మజ్నుకి.. మూడో హీరోయిన్ వేట మొదలైంది. మూడో రోల్ కోసం బడ్జెట్‌ ని లెక్కలోకి  తీసుకుంటున్నారు. కాస్త తక్కువలో కావాలంటే నిత్య మీనన్‌ అనీ.. డబ్బులు ఎక్కవైనా పర్లేదంటే రకుల్‌ ప్రీత్‌ ని సెట్ చేయాలని భావిస్తున్నారు. అయితే ట్రాక్ రికార్డ్ పరంగా నిత్య మీనన్ కి మొగ్గుతున్నా.. గ్లామర్ అద్దాలంటే మాత్రంం రకుల్ రావాల్సిందే. అందుకే ఎటూ తేల్చుకోలేకపోతున్నాడు చైతూ. అయితే.. థర్డ్ హీరోయిన్ రోల్ మాత్రం వీరిద్దరి  మధ్యే ఉండడం మాత్రం ఫిక్స్. ఎవరు అన్నది ఫైనల్ అవాలంతే.
Tags:    

Similar News