బంగార్రాజు అలా మొదలయ్యింది..!

Update: 2022-01-15 08:30 GMT
నాగార్జున మరియు నాగ చైతన్య నటించిన బంగార్రాజు సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సంక్రాంతికి పెద్ద సినిమాలు వచ్చి సందడి చేస్తాయి అనుకుంటూ ఉండగా అనూహ్యంగా ఆ సినిమాలు తప్పుకున్నాయి. దాంతో ఇప్పుడు సంక్రాంతికి వచ్చిన పెద్ద సినిమాల్లో బంగార్రాజు పెద్ద సినిమాగా నిలిచింది. నాగార్జున సోగ్గాడే చిన్ని నాయన సినిమాకు సీక్వెల్ గా రూపొందిన బంగార్రాజు సినిమా భారీ విజయాన్ని దక్కించుకుంది. అప్పుడు కూడా సంక్రాంతికే సోగ్గాడే ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఇప్పుడు బంగార్రాజు కూడా సంక్రాంతికి వచ్చి సెంటిమెంట్‌ ను రిపీట్‌ చేస్తున్నాడు. ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి పాజిటివ్‌ టాక్ దక్కింది.

ప్రస్తుతం కరోనా భయం ఉన్న కారణంగా జనాలు సినిమాను చాలా బాగుంది అంటేనే చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. యావరేజ్ సినిమాలను ప్లాప్‌ సినిమాలను రిస్క్‌ తీసుకుని వెళ్లడం ఎందుకు అనే ఉద్దేశ్యంతో ఉన్నారు. అందుకే సినిమాలు హిట్ టాక్ దక్కించుకుంటే భారీ వసూళ్లు నమోదు అవుతున్నాయి. ప్లాప్‌ టాక్ వస్తే మినిమం వసూళ్లు కూడా రావడం లేదు. బంగార్రాజు సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. మొదటి ఆట కాస్త స్లోగా స్టడీగా సాగింది. ఎక్కువ శాతం థియేటర్లలో 50 నుండి 70 శాతం మాత్రమే ఆక్యుపెన్సీ ఉందట. రెండవ ఆట నుండి వచ్చిన టాక్‌ తో అనూహ్యంగా పెరిగింది. రాత్రి రెండు షో లు కూడా ఎక్కువ శాతం హౌస్ ఫుల్‌ అయినట్లుగా ట్రేడ్‌ వర్గాల వారు అంటున్నారు.

నాగార్జున చాలా నమ్మకంతో ఈ సినిమా ను చేశాడు. సంక్రాంతికి విడుదల చేయాలనే ఉద్దేశ్యంతో యూనిట్‌ సభ్యులను ఉరుకులు పెట్టించాడు. సంక్రాంతిని వినియోగించుకోవాలని నాగార్జున చేసిన ప్రయత్నం సఫలం అయ్యింది. పరిస్థితులు అనుకూలిస్తే ఖచ్చితంగా భారీ వసూళ్లు నమోదు అవ్వడం ఖాయం. ఏపీ మరియు తెలంగాణలో నైట్‌ కర్ఫ్యూ ను మరో మూడు నాలుగు రోజుల్లో అమలు చేసే అవకాశాలు ఉన్నాయి. అంతే కాకుండా 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లను రన్ చేయబోతున్నారు. కనుక బంగార్రాజు ఈ మూడు నాలుగు రోజుల్లోనే సాధ్యం అయినంత వసూళ్లను దక్కించుకోవాల్సి ఉంది. పండక్కు వచ్చిన బంగార్రాజులు ఖచ్చితంగా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటారని అంతా భావించినట్లుగానే అలా మొదలైన బంగార్రాజు వసూళ్లు హౌస్‌ ఫుల్‌ అన్నట్లుగా దూసుకు పోతున్నాయి. ఈ వీకెండ్‌ మరియు సంక్రాంతి రెండు కలిపి సోమవారం వరకు కూడా వసూళ్ల జాతర ఉండే అవకాశం ఉంది. ఇతర సినిమాల టాక్ కూడా ఈ సినిమా వసూళ్లపై ప్రభావం పడే అవకాశం ఉంది.
Tags:    

Similar News