మ్యాథ్స్ లో ట్రిగ్నోమెట్రీ.. ట్రిగ్నోమెట్రీలో సైన్ తీటా కాస్ తీటాలు ఉన్నట్టే లవ్ లో కెమిస్ట్రీ ఉందని మనం ఫిక్స్ అయిపోతాం. అసలు లవ్ లో అనుబంధం ఉంటుంది.. నాకే సొంతం అనే పొసెసివ్ నెస్ ఉంటుంది.. జెలసీ ఉంటుంది.. అదృష్టవంతులైన కొందరికి అండర్ స్టాండింగ్ కూడా కొద్దిగా ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి కానీ ఆర్గానిక్ ఇనార్గానిక్ కెమిస్ట్రీలు ఎందుకుంటాయి? ఇది మనకేమీ వింతగా అనిపించదు కానీ బీకాంలో ఫిజిక్స్ ఉందంటే మాత్రం ఫక్కున నవ్వుతాం! ఆ విషయం బల్లగుద్ది మరీ నొక్కి ఒక్కాణించిన నేత మేథా శక్తికి నవ్వుకునే మనం లవ్ లో కెమిస్ట్రీ ఉంటుందని మన మేథా శక్తికి అసలు నవ్వుకోము.
సరే ఎలాగూ అందరూ అది కెమిస్ట్రీ అంటున్నారు కాబట్టి మనం కూడా కెమిస్ట్రీ అనుకోవలసిందే. ఈమధ్యే ఈ కెమిస్ట్రీనే గుర్తు చేశారు అక్కినేని క్యూట్ కపుల్ నాగచైతన్య - సమంతా జోడీ. అక్కినేని ఫ్యామిలీ హీరోలు మొదటి నుంచి రొమాన్స్ కు కేరాఫ్ అడ్రెస్. అది మొదటి తరం ఏఎన్నార్ అయినా.. రెండవ తరం నాగార్జున అయినా... మూడో తరం నాగచైతన్య అయినా. చైతు-సమంతాల వివాహమై ఇప్పటికే ఏడాది దాటింది. కానీ వారిద్దరి మధ్య లవ్ ఇంకా పెరిగినట్టే ఉంది. రీసెంట్ గా 'మజిలీ' ప్రమోషన్స్ సందర్భంగా ఈ జోడీ మీడియాను కలుస్తూ ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా గడుపుతున్నారు. అలాంటి ఒక ఇంటర్వ్యూలో తీసిన అందమైన ఫోటోనే పైనున్నది.
అక్కినేని నాగచైతన్య గారు.. సతీమణి సమంత బుగ్గను ప్రేమగా నిమురుతూ ఉంటే.. సమంతా.. చైతు కళ్ళలోకి సూటిగా చూస్తూ ఉంది. ఈ ఫోటోలో హైలైట్ ఏంటంటే సమంతా కాస్త పక్కకు వాలి చైతుకు దగ్గరగా జరిగి మరీ కూర్చోవడం. కుర్చీలు ఒక అడుగు దూరంలోనే ఉన్నా సమంతా దగ్గరకు జరిగకపోతే ఈ అందమైన దృశ్యం ఆవిష్కృతమయ్యేది కాదు. ఇక్కడ మనం కృతజ్ఞతలు చెప్పుకోవాల్సింది ముఖ్యంగా అధ్బుతమైన టైమింగ్ తో ఫోటోను క్లిక్కుమనిపించిన సదరు ఫోటోగ్రాఫర్ కే. ఆయన కనుక సరైన టైమింగ్ తో ఫోటో తీయకపోతే ట్రిగ్నోమెట్రీ.. కెమిస్ట్రీ.. ఫిజిక్స్.. ఈ ఆర్టికల్ ఏవీ ఉండేవి కాదు.