బోనీకపూర్ కి మాలీవుడ్ డైరెక్ట‌ర్ కండీష‌న్ ఇది!

Update: 2022-11-03 02:30 GMT
రీమేక్ అంటే మార్పులు..చేర్పులు త‌ప్ప‌నిస‌రి. ఉన్న‌ది ఉన్న‌ట్లు! ఏ మేక‌ర్ తెర‌కెక్కించ‌డు. నేటివిటీకి త‌గ్గ‌ట్టు మార్పులు చేసి అవ‌స‌రం మేర‌ కమ‌ర్శియ‌ల్ అంశాలు జొప్పించడం ఎక్క‌డైనా స‌హ‌జ‌మే. కంటెంట్ బేస్డ్ చిత్రాల్లో సైతం ఛెంజెస్ త‌ప్ప‌నిస‌రిగా భావిస్తారు. కానీ బాలీవుడ్ `మిలీ` లో మాత్రం ఎలాంటి మార్పులు లేకుండానే తెర‌కెక్కించిన‌ట్లు తెలుస్తోంది.

జాన్వీ క‌పూర్ ప్ర‌ధాన పాత్ర‌లో  `మిలీ` తెర‌కెక్కిన సంగ‌తి తెలిసిందే. మాలీవుడ్ లో  విజ‌యం సాధించిన `హెలెన్` చిత్రానికి రీమేక్ ఇది. మాతృక‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ముత్తుకుట్టి జేవియ‌ర్ నే హిందీలోనూ తెర‌కెక్కించారు. బోనీక‌పూర్ నిర్మించ‌గా..ఏ.ఆర్ రెహ‌మాన్ స్వ‌రాలు అందించారు. అయితే ఈ సినిమా క‌థ‌ని మార్చాల్సిందిగా నిర్మాత‌గా బో నీ క‌పూర్ కూడా ఒత్తిడి తీసుకొచ్చిన‌ట్లు తెలుస్తోంది.

కానీ ద‌ర్శ‌కుడు మాత్రం అందుకు ఒప్పుకోలేదు. స్ర్కిప్ట్ మారిస్తే అస‌లు సినిమా నే చేయ‌ని తెగేసి చెప్ప‌డంతోత పూరి్గా ద‌ర్శ‌కుడి అభిరుచి మేర‌కే చిత్రాన్ని హిందీలో రీమేక్ చేసినట్లు తెలుస్తోంది. సాధార‌ణంగా నిర్మాత‌లు మార్పులు కొర‌తారు.  స‌క్సెస్ అవ్వాలంటే కొన్ని సార్లు ద‌ర్శ‌కులు రాజీ ప‌డ‌క త‌ప్ప‌దు. వాణిజ్య అంశాల ప‌రంగా జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రి.

కానీ `మిలీ` విష‌యంలో జేవియ‌ర్ బోనిని బేఖ‌త‌రు చేసిన‌ట్లు తెలుస్తోంది. వాస్త‌వానికి ఈ సినిమాని చాలా భాష‌ల్లో రీమేక్ చేయాల‌ని భావించారుట‌. కానీ అంద‌రూ మార్పులు కోర‌డంతో ద‌ర్శ‌కుడుకి అది ఇష్టం లేక వ‌చ్చిన అవ‌కాశాలు వ‌దులుకున్న‌ట్లు తెలుస్తోంది. అయితే పాత్ర‌ల ప‌రంగా మార్పులు చేసిన‌ట్లు చెబుతున్నారు. బోనీ కూడా త‌న‌ని అర్ధం చేసుకుని అన్ని ర‌కాలుగా స‌హ‌క‌రించినట్లు తెలుస్తోంది.

మాతృక వెర్ష‌న్ ని మించి హిందీలో సినిమా మ‌రింత బాగా వ‌చ్చిన‌ట్లు యూనిట్ ధీమా వ్య‌క్తం చేస్తోంది. అయితే హిందీ నిర్మాణం మాత్రం ద‌ర్శ‌కుడికి స‌వాల్ గా మారిన‌ట్లు తెలుస్తోంది. మాతృక‌లో సింపుల్ గా తేల్చేసిన హిందీ కొచ్చేస‌రికి పాత్ర‌ల‌కు అనుగుణంగా న‌టీన‌టుల్ని ఎంపిక చేసుకోవ‌డం స‌వాల్ గా మారిన‌ట్లు ద‌ర్శ‌కుడు తెలిపారు. మ‌రోవైపు భాష స‌మ‌స్య‌తోనూ ఇబ్బంది ప‌డిన‌ట్లు చెబుతున్నారు. అయితే ఈ విష‌యంలో జాన్వీ బాగా స‌హ‌క‌రించింద‌ని ద‌ర్శ‌కుడు గుర్తు చేసుకున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News