బాలీవుడ్.. టాలీవుడ్ ఏ వుడ్ స్టార్ అయినా తమ స్టార్ డమ్ ను చూపించేందుకు.. తమ స్టేటస్ ను ప్రదర్శించేందుకు గాను అత్యంత ఖరీదైన కార్లను కొనుగోలు చేస్తూ ఉంటారు. కొందరు స్టేటస్ సింబల్ గా కొనుగోలు చేస్తూ ఉంటే మరి కొందరు మాత్రం కార్లపై మోజుతో కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇక కొందరు సెక్యూరిటీ ఫీచర్స్ ఇతర విషయాల ఆధారంగా కొనుగోలు చేస్తూ ఉంటారు. ప్రపంచంలో అత్యంత ఖరీదైన కార్లను ఇండియన్ సెలబ్రెటీలు కొనుగోలు చేసేందుకు ఎప్పుడు ముందే ఉంటారు అనడంలో సందేహం లేదు.
బాలీవుడ్ నుండి కోలీవుడ్ టాలీవుడ్ ఇలా అన్ని భాషల సినీ ప్రముఖులు.. వ్యాపారవేత్తలు మరియు రాజకీయ నాయకుల వారసులు ఇలా ప్రతి ఒక్క సెలబ్రెటీ కూడా మార్కెట్ లోకి కొత్త మోడల్ కారు వచ్చింది అంటే దాన్ని కొనుగోలు చేసేందుకు సిద్దంగా ఉంటారు. కొత్త కార్లు కొనుగోలు చేసే సెలబ్రెటీలు ఎక్కువగా ఈమద్య రోల్స్ రాయిస్ మరియు లంబోర్గిని కార్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. ఆ తర్వాత మెర్సిడెస్ కార్ల విషయంలో ఎప్పటి నుండో సెలబ్రెటీల్లో మోజు కొనసాగుతూ ఉంటుంది.
తాజాగా మెర్సిడెస్ కార్లలో కొత్త మోడల్ మార్కెట్ లోకి వచ్చింది. మెర్సిడెస్-మేబాచ్ జిఎల్ఎస్ 600 అనే ఈ కారును ఇండియన్ మార్కెట్ లో 50 యూనిట్లను అందుబాటులో ఉంచారట. మార్కెట్ లోకి రాకముందే ఈ కారును చాలా మంది బుక్ చేశారు. ఇటీవలే ఈ కారు బాలీవుడ్ యంగ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ గ్యారేజీలో చేరింది. 2.43 కోట్ల ఎక్స్ షో రూం ధర కలిగి ఉన్న ఈ కారును దక్కించుకునేందుకు ఇంకా చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు. అత్యంత స్టైలిష్ లుక్ తో పాటు ఇంటీరియర్ కూడా గత మెర్సిడెస్ కార్లతో పోల్చితే ఈ కొత్త మోడల్ లో అద్బుతమైన ఫీచర్స్ ఉన్నాయట. ఇండియన్ రోడ్లకు మరియు మార్కెట్ కు అనుకూలంగా ఉన్న ఈ కార్లను దక్కించుకునేందుకు టాలీవుడ్ సెలబ్రెటీలు కూడా ప్రయత్నాలు చేస్తున్నారనే టాక్ వినిపిస్తుంది.
పలువురు టాలీవుడ్ యంగ్ హీరోలు మరియు ఇండస్ట్రీకి చెందిన కొందరు వారసులు ఈ కారును ఇప్పటికే బుక్ చేశారట. కారు రేటు భారీగా ఉన్నా కూడా స్టేటస్ సింబల్ గా ఉండటంతో పాటు లుక్ పరంగా రాయల్ లుక్ వస్తుందని భావించిన వారు కొత్తగా వచ్చిన ఈ మోడల్ ను దక్కించుకునేందుకు సాధ్యం అయినంత వరకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఒకరు ఇద్దరు తెలుగు రాజకీయ నాయకుల వారసులు కూడా ఈ కారును కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. దేశ వ్యాప్తంగా ఎంతో మంది ప్రముఖుల కన్ను ఈ మోడల్ కారు పై పడటంతో తెలుగు సినీ ప్రముఖుల్లో ఎవరి గ్యారేజ్ కు ఈ కారు వస్తుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది.
ప్రభాస్ ఇటీవలే భారీ మొత్తం ఖర్చు చేసి లంబోర్గిన కారును కొనుగోలు చేసిన విషయం తెల్సిందే. ఇంకా కొందరు కూడా రేంజ్ రోవర్ ఇంకా అత్యంత ఖరీదైన కార్లను కొనుగోలు చేశారు. ఇటీవల కొత్త కార్లను కొనుగోలు చేసిన వారు కూడా మళ్లీ ఈ మోడల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. మొత్తం 50 యూనిట్ల కార్లను డిసెంబర్ నాటికి అందించేందుకు సదరు కంపెనీ ప్రయత్నాలు చేస్తుందట. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం అతి త్వరలో ఒక తెలుగు సెలబ్రెటీ ఇంటికి ఈ కారు వస్తుందని సమాచారం అందుతోంది. త్వరలోనే ఆ విషయమై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇన్ని కోట్లు పెట్టి ఇన్నిన్ని కార్లు కొంటున్న సెలబ్రెటీల లగ్జరీ లైఫ్ చూసి నెటిజన్స్ ముక్కున వేలేసుకుంటూ ఉంటారు.