'ది వ్యాక్సిన్ వార్' టైటిల్ వెనుక క‌హానీ ఇది!

Update: 2022-11-14 08:36 GMT
కశ్మీరీ పండిట్ల ఊచ‌కోత నేప‌థ్యంలో వివేక్ రంజ‌న్ అగ్నిహోత్రి తెర‌కెక్కించిన సంచ‌ల‌న చిత్రం 'ది క‌శ్మీర్ ఫైల్స్‌'. ద‌ర్శ‌కుడు వివేక్ రంజ‌న్ అగ్నిహోత్రి, నిర్మాత‌, న‌టి ప‌ల్ల‌వి జోషీ క‌లిసి తాజాగా మ‌రో సంచ‌ల‌న చిత్రానికి శ్రీ‌కారం చుట్టారు. ఇటీవ‌ల ద‌ర్శ‌కుడు వివేక్ రంజ‌న్ అగ్నిహోత్రి త‌న త‌దుప‌రి సినిమా టైటిల్ గురించి పోస్ట్ చేస్తూ ది ...వార్‌' అని వెల్ల‌డించి ఆ ఖాలీని పూరించి సినిమా టైటిల్ ని క‌నిపెట్టండ‌ని ప్రేక్ష‌కుల‌కు ఓ ప‌జిల్ వేశారు.

రీసెంట్ గా ఈ మూవీ టైటిల్ ని సినిమా పేరు 'ది వ్యాక్సిన్ వార్' అని ప్ర‌క‌టిస్తూనే ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌ల‌ని జోడించాడు. 'ది వ్యాక్సిన్ వార్' ని ప్ర‌జెంట్ చేస్తున్నాం. దీని కోసం ఇండియా ఎంత‌గా ఫైట్ చేసిందో మీకు తెలియ‌ని ఆస‌క్తిక‌ర‌మైన క‌థ‌ని చెప్ప‌బోతున్నాను. అంతే కాకుండా ఈ వార్ లో ఇండియా దాని పైన్స్‌, ధైర్యం, గొప్ప భార‌తీయ విలువ‌ల‌దో గెలిచింది. ఈ సినిమాని 2023 స్వాతంత్య్ర దినోత్స‌వం రోజున ఆగ‌స్టు 15న మొత్తం 11 భాష‌ల్లో రిలీజ్ చేస్తున్నాం' అని వెల్ల‌డించారు.  

తాజాగా సోమ‌వారం ఈ మూవీకి 'ది వ్యాక్సిన్ వార్‌' అనే టైటిల్ ఎందుకు పెట్టాల్సి వ‌చ్చిందో దాని వెన‌కున్న క‌హానీ ఎంటో వెల్ల‌డిస్తూ ఓ వీడియోని విడుద‌ల చేశారు. 'ది క‌శ్మీర్ ఫైల్స్ కోవిడ్‌, లాక్ డౌన్ కార‌ణంగా డిలే అవుతూ వ‌స్తోంది.

ఈ విష‌యంలో టీమ్ అంతా చాలా ఆందోళ‌న‌కు గుర‌య్యాం. ఎలా పూర్తి చేయాలి.. ఎప్పుడు రిలీజ్ చేయాల‌ని. అయితే ఇదే స‌మ‌యంలో కోవిడ్ పై టీమ్ అంతా రీసెర్చ్ చేయ‌డం మొద‌లు పెట్టాం. ఇదే స‌మ‌యంలో క‌రోరా నుంచి యావ‌త్ భార‌తీయుల‌ని కాపాడేందుకు ఇండియా వ్యాక్సిన్ త‌యారు చేయ‌డం మొద‌లు పెట్టింది. చాలా మందికి ఈ వ్యాక్సిన్ త‌యారు చేసింది ఎవ‌రో ఎవ‌రికీ తెలియ‌దు.

కానీ చాలా పెద్ద వాళ్లు ఈ వ్యాక్సిన్ ని క‌నిపెట్టార‌ని ప్ర‌చారం జ‌రిగింది. అయితే వ్యాక్సిన్ ని క‌నిపెట్టింది మాత్రం చాలా సాధార‌ణ వ్య‌క్తులు. చాలా రోజులు ల్యాబ్ లో వుండి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో ఓ లేడీ త‌న పిల్ల‌ల ప‌నులు చేస్తూనే వ్యాక్సిన్ ని త‌యారు చేసే ప‌రిశోధ‌న‌ల్లో రాత్రింబ‌వ‌ళ్లు ప‌ని చేసింది. ఇలా వ్యాక్సింగ్ కోసం ప‌రిశోధ‌న చేస్తున్న వ్య‌క్తుల‌పై రీసెర్చ్ చేశాం. మ‌రో ప‌క్క‌ భార‌త్ పై బ‌యోవార్ జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలో భార‌త్ వ్యాక్సిన్ ని క‌నిపెట్ట‌డం క‌ష్ట‌మ‌ని అంతా భావించ‌డం మొద‌లు పెట్టారు. ఈ బ‌యోవార్ లో భార‌త్ కు వ్య‌తిరేకంగా మ‌న దేశంలో వున్న చాలా మంది ప‌ని చేశారు.

వేరే వాళ్ల కోసం కొంత మంది డ‌బ్బులు తీసుకుని వ్యాక్సిన్ త‌యారు చేయ‌డం మొద‌లు పెట్టారు. ఈ పోటీలో మ‌న దేశానికి చెందిన సాధార‌ణ సైంటిస్ట్ లు అసాధార‌ణ కృషి చేసి అత్యంత సుర‌క్షిత‌మైన వ్యాక్సిన్ ని క‌నిపెట్టారు. ఈ స్టోరీ విని నా కంట క‌న్నీళ్లు ఆగ‌లేదు. చాలా స్ఫూర్తిదాయ‌కంగా అనిపించింది. సాధార‌ణ సైంటిస్ట్ లు ఈ వార్ లో భార‌తీయుల న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టారు. ఇదే క‌థ‌ని 'ది వ్యాక్సిన్ వార్'లో చూపించ‌బోతున్నాను. ముందు ఈ క‌థ‌కు వేరే పేరు అనుకున్నాను కానీ 'ది వ్యాక్సిన్ వార్‌' క‌రెక్ట్ అనిపించి దాన్నే ఫైన‌ల్ చేశాం' అంటూ 'ది వ్యాక్సిన్ వార్‌' టైటిల్ వెన‌కున్న ఆస‌క్తిక‌ర‌మైన క‌హానీని బ‌య‌ట‌పెట్టారు ద‌ర్శ‌కుడు వివేక్ రంజ‌న్ అగ్నిహోత్రి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Full View


Tags:    

Similar News