త్రిష బ్యూటీ సీక్రెట్ ఇదే!

Update: 2022-11-15 07:30 GMT
అందాల త్రిష 40 కి చేరువ‌లో ఉంది. అయినా అమ్మ‌డి బ్యూటీలో ఎలాంటి మార్పులు రాలేదు. కెరీర్ కొత్త‌లో  ఎంత అందంగా క‌నిపించిందో..ఇప్ప‌టికీ అదే అందాన్ని మెయింటెన్ చేస్తుంది. ఇటీవ‌ల రిలీజ్ అయిన పొన్నియ‌న్ సెల్వ‌న్ లో రాజ‌కుమారి పాత్ర‌లో మ‌రింత అందంగా క‌నిపించింది.  అమ్మ‌డి ప్రిన్సెస్ అందానికి ప్రేక్ష‌కాభిమానులు మ‌రోసారి ఫిదా అయ్యారు.

అందం..అభిన‌యంలో నేటి త‌రం నాయిక‌ల‌కు ఏమాత్రం తీసిపోకుండా అదే చ‌రిష్మాని కొనసాగిస్తుంది. మ‌రి ఈ బ్యూటీ వెనుక సీక్రెట్ ఏంటి? అంటే చాలా సంగ‌తులే ఉన్నాయ‌ని చెప్పొచ్చు. త్రిష సైతం మంచి ఫిట్ నెస్ ప్రీక్. నిరంత‌రం వ్యాయామాలు త‌ప్పనిస‌రిగా చేస్తుంది. అమ్మ‌డి డే వ్యాయామంతోనే మొద‌ల‌వుతుంది.   అమె జీవితంలో ఇప్ప‌టివ‌ర‌కూ వ్యాయామం చేయ‌ని రోజు ఒక్క‌టి కూడా లేదు.

అలాగ‌ని మితి మీరిన వ‌ర్కౌట్లు చేయ‌దు. సింపుల్ ఎక్స‌ర‌సైజుల‌తోనే రూప లావ‌ణ్యాన్ని ఎంతో సౌంద‌ర్య‌వంతంగా ఉంచుకుంటుంది. ఆహారం విష‌యంలో పూర్తి జాగ్ర‌త్త‌లు వ‌హిస్తుంది. అలాగ‌ని వెజిటేరియ‌న్ కాదు. అమ్మ‌డు మంచి మాంసాహారి. అందులో అన్ని ర‌కాలు రుచులు ఆస్వాదిస్తుంది. ఇష్ట‌మైన అన్ని వంట‌కాలు రుచి చుస్తుంది.

ఇక బిర్యానీ క‌ళ్ల ముందుంటే క‌డుపునిండా లాగించేస్తుంది. అయితే ఆ మ‌రుఏస‌టి రోజు అందుకు త‌గ్గ వ్యాయామిన్ని ముందుగానే ప్లాన్ చేసుకుంటుంది. తిన్న‌దంతా అరిగే వ‌రకూ శ్ర‌మిస్తుంది. చెమ‌ట రూపంలో కొవ్వు ప‌దార్ధాల్ని బ‌య‌ట‌కి పంపిచేస్తుంది. ఇక అమ్మ‌డి వెంట నిత్యం డ్రైప్రూట్స్..న‌ట్స్..సి విట‌మిన్ వంటివి ఉంటాయట‌.

ఆరేంజ్..దానిమ్మి..బ‌త్తాయి లాంటివి ఎక్కువ‌గా తీసుకుంటుంది. ఆక‌లేస్తే వాటితోనే క‌డుపు నింపుకుంటుంది. సినిమా సెట్స్ లో ఉన్న‌ప్పుడు ఎక్కువ‌గా ఆ ర‌ మైన పుడ్ నే ఎంపిక చేసుకుంటుందిట‌. అలాగే  మంచి నీళ్లు ఎక్కువ‌గా తాగుతుంది. డే ముగిసేలోపు ఆరేడు లీడ‌ట‌ర్లు నీళ్లు తీసుకుంటుందిట‌.   అలాగే స్నేహితుల‌తో పార్టీల్నీ బాగానే ఆస్వాదిస్తుంది.

నైట్ పార్టీలు..వీకెండ్ పార్టీలు..గెట్ టూ  గెద‌ర్ లాంటి వాటిని ఏమాత్రం మిస్ కాదుట‌. ఎంత బిజీగా ఉన్నా వాటికంటూ కొంత స్పేస్ ని  కేటాయించి ఆస్వాదిస్తుంద‌ని స‌న్నిహితులు చెబుతున్నారు. ఇక న‌టిగా త్రిష బిజీగా కొన‌సాగుతోన్న సంగ‌తి తెలిసిందే. ఎక్కువ‌గా కోలీవుడ్  సినిమాల‌కే డేట్లు కేటాయిస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News