ఆ యంగ్ హీరో దుకాణం స‌ర్దేయాల్సిందేనా?

Update: 2022-11-23 15:30 GMT
ఇండ‌స్ర్టీలో బ్యాక‌ప్ కొంత వ‌ర‌కే. అది కేవ‌లం ఎంట్రీ స‌హా మ‌రో రెండు..మూడు ఛాన్స్ ల వ‌ర‌కే ప‌రిమితం.  ఆ త‌ర్వాత ట్యాలెంట్ తోనే ముందుకెళ్లాలి. ఎంత పెద్ద స్టార్ కుమారుడైనా...ప‌రిశ్ర‌మ నుంచి ఎలాంటి స‌హ‌కారం ఉన్నా అది ప‌రిమితంగానే అన్నది గుర్తించ‌క‌పోతే చేతులు కాలిన‌ట్లే. కుర్చుని తింటే కొండైనా త‌రిగిపోతుందంటారుగా. ఆ లెక్క‌న ఎవరూ స‌పోర్ట్ అయిన కొన్ని రోజులే. ఆ త‌ర్వాత స్వ‌యంగా కొత్త మార్గాన్ని అన్వేషించాల్సిందే.

ఇండ‌స్ర్టీలో ఇప్పుడోయువ న‌టుడి ప‌రిస్థితి అలాగే ఉంద‌ని ప్ర‌చారం సాగుతోంది. ఓ స్టార్ హీరో త‌మ్ముడిగా ఎంట్రీ ఇచ్చిన అత‌ను నాలుగైదు సినిమాలు చేసాడు. అందులో ఓ సినిమా యావ‌రేజ్ గా ఆడింది. మ‌రో రెండు..మూడు సినిమాలు లైన్ లో ఉన్నాయి. అయితే ఆ యువ హీరోకి ఇదే చివ‌రి ఆవ‌కాశంగా క‌నిపిస్తుంది.  ఇప్ప‌టికే అత‌నిపై నెగిటివిటీ  స్ర్పెడ్ అవుతుంది.

ఇండ‌స్ర్టీకి జెడెటెడ్ అయిపోయాడు అన్న విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. అత‌ను ఎంపిక చేసుకునే క‌థ‌ల్లో కొత్త‌ద‌నం లేద‌ని... మేక‌ర్స్ కూడా అత‌న్నికొంత మంది మేక‌ర్స్ త‌ప్పు దారి ప‌ట్టిస్తున్నార‌ని ప్ర‌చారం సాగుతోంది. సినిమా జయాప‌జ‌యాల సంగ‌తి పక్క‌న‌బెడితే యాక్టింగ్ ప‌రంగానూ అత‌నిలో కొత్త‌ద‌నం ఏముందని సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌శ్న‌ల వర్షం కురుస్తోంది.

అన్న‌య్య‌ని అనుక‌రించ‌డం త‌ప్ప అత‌నికి కొత్త‌గా ఇంకేమైనా తెలుసా? అంటూ గుస‌గుస లాడుకుంటున్నారు. ప్ర‌స్తుతం చేతిలో  ఉన్న‌ అవ‌కాశాలే  ఆ యంగ్ హీరోకి  చిట్ట చివ‌రివి అంటున్నారు. వాటితోనైనా తానేంటో నిరూపించుకోలేక‌పోతే గ‌నుక కెరీర్ చ‌ర‌మాంకానికి చేరిన‌ట్లే అంటున్నారు.

కొన్నేళ్ల క్రితం ఓస్టార్  డైరెక్ట‌ర్ త‌మ్ముడు కూడా అన్న క్రేజ్ తోనే లాంచ్ అయ్యాడు. ఏవో కొన్ని సినిమాలు చేసాడు త‌ప్ప ప‌రిశ్ర‌మ‌లో నిల‌దొక్కుకోలేదు. ఇప్ప‌టికీ అప్పుడ‌ప్పుడు అడ‌పా ద‌డ‌పా సినిమాలు చేయ‌డం త‌ప్ప అత‌ను సాధించిందేం లేదు.  మ‌రి ఈ స్టార్ హీరో త‌మ్ముడు భ‌వితవ్యం ఎలా ఉందో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News