స్కూల్ కాలేజ్ డేస్ లో కొన్ని గోల్స్ ఉంటాయి. అయితే కాలక్రమంలో తాము అనుకున్నది కాకుండా ఇంకేదో అవుతుంది. డాక్టర్ కాబోయి యాక్టర్లు అయిన వారెందరో. కానీ రాశీ మాత్రం ఐఏఎస్ కాబోయి నటి అయ్యిందిట. ఆ విషయాన్ని చాలా ఇంటర్వ్యూల్లో చెప్పింది రాశీ ఖన్నా.
ప్రతిభావంతురాలైన యువ బ్యూటీ రాశి ఖన్నా ప్రస్తుతం రెండు ఎగ్జయిటింగ్ తమిళ ప్రాజెక్టుల షూటింగ్ లతో బిజీగా ఉన్నారు. ఇటీవల కోలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ పలు షాకిచ్చే సంగతులు చెప్పారు. భవిష్యత్తులో తాను రాజకీయాల్లోకి అడుగుపెడతానని రాశీ అన్నారు.
``చిన్నతనంలో ఎల్లప్పుడూ IAS ఆఫీసర్ కావాలని కోరుకున్నాను. కానీ నటిగా ముగించాను. నా చిన్ననాటి కలను ఇప్పుడు నెరవేర్చలేనని నాకు తెలుసు. కానీ నేను ఖచ్చితంగా రాజకీయాల్లోకి ప్రవేశించి ప్రజల కోసం పని చేస్తాను. దీనికి ముందు నేను ఒక ఎన్జీవోను ప్రారంభిస్తాను. ప్రజల సమస్యలను తెలుసుకుంటాను. రాజకీయాలు ఎలా చేయాలో నాకు తెలియదు. కానీ ప్రజలకు బాగా ఎలా సహాయం చేయాలో నాకు తెలుసు ” అని రాశీ అన్నారు. సేవ చేయాలనే ఆలోచనతో శభాష్ అనిపిస్తోంది. ఈ చక్కనమ్మ ఆకాంక్ష నెరవేరాలని కోరుకుందాం.