ర‌ష్మిక‌లో ఈ సడెన్ ఛేంజ్ షాకిస్తోంది!

Update: 2021-05-14 11:30 GMT
క‌న్న‌డ బ్యూటీ ర‌ష్మిక మందన కెరీర్ జెట్ స్పీడ్ తో దూసుకెళుతున్న సంగ‌తి తెలిసిందే. తెలుగు- హిందీ భాష‌ల్లో ప్ర‌స్తుతం వ‌రుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఒక్కో భాష‌లో రెండేసి ప్రాజెక్ట్ ల‌తో తీరిక చిక్క‌ని ప‌రిస్థితి. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స‌ర‌స‌న `పుష్ప‌`లో న‌టిస్తోంది. `ఆడ‌వాళ్లు మీకు జోహార్లు` చిత్రంలో శ‌ర్వా స‌ర‌స‌న న‌టిస్తోంది. బాలీవుడ్ లో మిష‌న్ మ‌జ్ను స‌హా అమితాబ్ తో ఓ సినిమా చేస్తోంది. మరికొన్ని ప్రాజెక్ట్ లు చ‌ర్చ‌ల ద‌శ‌లో ఉన్నాయి.

మ‌రి ఇంత బిజీగా ఉన్న ర‌ష్మిక త‌న లుక్ విష‌యంలో టెన్ష‌న్ ప‌డిపోతోంద‌నేది తాజా గుస‌గుస‌. చ‌క్క‌ని పెర్పామ‌ర్  గా నిరూపించుకుని ప‌క్కింట‌మ్మాయి ఇమేజ్ తెచ్చుకున్నా హాట్ గాళ్ అన్న ట్యాగ్ మాత్రం త‌న‌కు ద‌క్క‌డం లేద‌ని వాపోతోంద‌ట‌. అందుకే ఇటీవ‌ల యూత్ లో పాపుల‌ర్ కాలేక‌పోతోంది. అయితే ఆ డౌట్స్ కూడా క్లియ‌ర్ చేయాల‌ని ఆ దిశ‌గా ప్ర‌య‌త్నాలు మొద‌లెట్టేసింద‌నేది తాజా స‌మాచారం. స్టార్ హీరోల స‌ర‌స‌న మాస్ అప్పీల్ తో ఆక‌ట్టుకోవాల‌ని ర‌ష్మిక‌ త‌ప‌న ప‌డుతోందిట‌. అందుకు త‌గ్గ‌ట్టే త‌న లుక్ ని అన్ని ర‌కాలుగా మార్పుకునేందుకు ప్ర‌య‌త్నిస్తోంది.

మునుప‌టితో పోలిస్తే ఇటీవ‌ల ర‌ష్మిక‌ బ‌రువు పెర‌గ‌డానికి కార‌ణ‌మిదేన‌ట‌. ఈ కొత్త లుక్ కోసం ఆహార నియ‌మాలు పాటిస్తూ సీరియ‌స్ గా క‌స‌ర‌త్తులు చేస్తోంది. అన్ని ర‌కాలుగా ఫిట్ గా.. అంత‌కుమించి హాట్ గా మారాలంటే ఏమేమి చేయాలో అన్ని చేస్తోంద‌ట‌. జిమ్ లో శిక్ష‌ణ‌ కోసం ఓ  ట్రైన‌ర్ ని పెట్టుకుని అదే ప‌నిమీద ఉన్న‌ట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ర‌ష్మిక‌లో ఈ సడెన్ ఛేంజ్ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. ఈ ప్ర‌య‌త్నాన్ని ముందొస్తు జాగ్ర‌త్త అనుకోవాలా?  లేక ఫియ‌ర్ ఫ్యాక్ట‌ర్ అనాలా? అన్న‌ది అర్థం కాని ప‌రిస్థితి. కొన్నిటిని కాల‌మే నిర్ణ‌యించాలి.
Tags:    

Similar News