బాలీవుడ్లో నాలుగేళ్ల కిందట సూపర్ హిట్టయిన ‘క్వీన్’ సినిమాను దక్షిణాదిన అన్ని భాషల్లోనూ రీమేక్ చేయాలని ఎప్పట్నుంచో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎట్టకేలకు ఆ ప్రయత్నాలు ఫలించి కొన్ని నెలల కిందటే నాలుగు భాషల్లోనూ వేర్వేరుగా సినిమాలు మొదలయ్యాయి. నాలుగు భాషలకు నలుగురు హీరోయిన్లను.. నలుగురు డైరెక్టర్లను పెట్టుకున్నారు ఈ చిత్రానికి. తర్వాత డైరెక్టర్లు ముగ్గురయ్యారు. తమిళ.. కన్నడ వెర్షన్లకు రమేష్ అరవింద్ ను ఖాయం చేస్తే.. తెలుగు వెర్షన్ కు ప్రశాంత్ వర్మ ఫిక్సయ్యాడు. మలయాళ వెర్షన్ కు రేవతి దర్శకత్వం వహిస్తోంది. తెలుగులో తమన్నా.. తమిళంలో కాజల్.. కన్నడలో పారుల్ యాదవ్.. మలయాళంలో మాంజిమా మోహన్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.
కానీ విచిత్రమైన విషయం ఏంటంటే.. ఈ నాలుగు వెర్షన్ల షూటింగూ ఒకే చోట జరుగుతోంది. ముందు అందరూ కలిసి ప్యారిస్ వెళ్లారు. ఆ తర్వాత ఇప్పుడు చెన్నైలో షూటింగ్ నడుస్తోంది. ఒకే లోకేషన్ నుంచి అందరూ కలిసి ఫొటోలు దిగి సోషల్ మీడయిాలో షేర్ చేస్తున్నారు. తమిళంలో కథానాయికగా చెబుతున్న కాజల్ చెబుతున్న దాని ప్రకారం.. ఒకే లొకేషన్లూ నలుగురూ ఒకే సన్నివేశంలో మార్చి మార్చి నటిస్తున్నారట. అసలు ఈ సినిమా వేర్వేరుగా నలుగురు హీరోయిన్లను పెట్టడం ఎందుకు.. అందరికీ పరిచయం ఉన్న కాజల్.. తమన్నా లాంటి ఒకరిని పెట్టి నాలుగు భాషల్లో వేర్వేరుగా సినిమా తీయొచ్చుగా అన్న అభిప్రాయం ముందు నుంచి ఉండగా.. కాజల్ చెబుతున్న తీరు చూస్తే ఈ మాత్రం దానికి వేర్వేరు భాషలకు వేర్వేరు దర్శకులు కూడా ఎందుకన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి ఇలా హీరోయిన్లు.. దర్శకుల్ని మార్చి ఒకే చోట ఒకే రకంగా సన్నివేశాలు తీయడం ద్వారా ఏం వైవిధ్యం తీసుకొస్తారో చూడాలి.