సినిమాకు ట్విస్టు అనేది చాలా ఇంట్రస్టింగ్ పాయింట్. సినిమాలో ఎన్ని ట్విస్టులుంటే అంత ఆసక్తికరంగా నడుస్తుంటుంది. అలాగే స్టోరీ ఏంటో ముందు తెలియకుండా ఉంటేనే ప్రేక్షకుల్లో ఉత్కంఠ ఉంటుంది. ఇక మీడియా వాళ్లకు ముందు స్టోరీ తెలియకపోతే అదిగో పులి..ఇదిగో తోక అన్న చందంగా ఆ మూవీ స్టోరీ అలా..ఇలా అని ఎవరికిష్టం వచ్చినట్టు వారు సొంత కథలు అల్లేసుకుంటాడు.
అయితే టాలీవుడ్ లో ఎస్ ఎస్.రాజమౌళి, వివి.వినాయక్, కొరటాల శివ విషయానికి వస్తే వీరికి ఓ ప్రత్యేకత కనపడుతుంది. ముందుగానే సినిమా స్టోరీ చెప్పేస్తారు. లేదా మెయిన్ లైన్ ఒక్కసారి తెలియకపోవచ్చు. అయితే వీరి స్పెషాలిటీ ఏంటంటే సినిమాలో ట్విస్టులు లేకుండా ప్లాట్ గా రన్ చేసి మెప్పించేస్తారు.
ఉదాహరణకు జక్కన్న విజువల్ వండర్ బాహుబలి లో కట్టప్ప ట్విస్ట్ తప్ప సినిమా మొత్తం ప్లాట్ గానే నడుస్తుంది. ఈ సినిమా స్టోరీ వార్ నేపథ్యంలో ఉంటుందని ముందుగానే తెలిసిపోయింది. లైన్ ఎలా ఉంటుందో కూడా ముందే అర్థమైంది. అయినా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. బాహుబలి సెకండాఫ్ చూసుకున్నా స్టోరీ పరంగా మనం చాలా వరకు ముందే ఊహించేయొచ్చు. అయితే ఆ సినిమా కోసం మనం ఎంతో ఆసక్తిగా చూస్తున్నాం అంటే అదే జక్కన్న స్పెషాలిటి.
ఇక వినాయక్ సినిమాల్లో కూడా స్టోరీ ఎక్కువగా పాతదే..మనకు తెలిసిందే ఉంటుంది. చెప్పుకోదగ్గ ట్విస్టులు కూడా ఉండవు. ఆయన ప్రతి సినిమాలోను టాటాసుమోలు గాల్లోకి ఎగరడం కామన్. యాక్షన్ సీన్లు ఎలాగూ ఉంటాయి. అయితే మూవీ మాత్రం కమర్షియల్ గా వర్క్ వుట్ అయిపోతుంది.
తాజాగా శ్రీమంతుడు సినిమా చూస్తే కొరటాల శివ కూడా అదే స్టైల్ ను తన పంథాలో ఫాలో అయ్యారు. మిర్చిలో ఇంట్రస్టింగ్ ట్విస్టులు ఉండవు. సినిమా ఫాస్ట్ గాను కదలదు. అయితే సినిమాలో ఏ టైంలో ఏది ఉండాలో మాత్రం బాగా తెలిసిన వాడు. ఇప్పుడు శ్రీమంతుడులో కూడా ఫస్టాఫ్ ముగిసే టైంకు అసలు కథలోకి ఎంటర్ అవ్వకుండా ప్లాట్ గానే స్టోరీ నడిపించేసి ఇంటర్వెల్ నుంచి కాస్త స్టోరీ పరంగా సినిమాను స్పీడప్ చేస్తాడు. చెప్పుకోదగ్గ ట్విస్టులూ లేవు. శ్రీమంతుడు స్టోరీ ఏంటో ఆయన ట్రైలర్ లోను, ఇంటర్వ్యూ ల్లో కూడా చెప్పేశాడు. అయినా సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. ఇలా ఈ ముగ్గురు డైరెక్టర్లు స్టోరీ ముందు లీక్ చేసినా..ట్విస్టులు లేకున్నా హిట్లు కొట్టడంతో తమకంటూ ఓ స్పెషాలిటీ ఏర్పరుచుకున్నారు.