జమానా కాలంలో మన తాత ముత్తాతలు ఓ విషయం గురించి ఆసక్తిగా మాట్లాడుకునేవారు. నాటి రాజుల కాలంలో బంధిపోటు దొంగల భీభత్సం గురించి కథలు కథలుగా మాట్లాడుకునేవారు. ఊళ్లపై పడి జనాల్ని హతమార్చి దోచుకుని వెళ్లిపోయే దుర్మార్గులు - కర్కశులు అంటూ కథలు చెప్పేవారు. మన భామ్మలు - అమ్మమ్మలు వాటిని కథలుగా చెబుతుంటే చెవులు రిక్కించి వినేవాళ్లం. ఇప్పుడు అదే స్ఫూర్తితో ఓ సినిమా వస్తోంది. బంధిపోటు దొంగలు నాడు ఎలాంటి అరాచకాలు సాగించేవారో వెండితెరపై చూపించే ప్రయత్నం సాగుతోంది. ది గ్రేట్ విజయ్ కృష్ణ ఆచార్య ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ధూమ్ సిరీస్ కి కథలు అందించిన ఆయన ధూమ్ 3 చిత్రానికి దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే.
ఈ ఆసక్తికర సినిమా టైటిల్ `థగ్స్ ఆఫ్ హిందూస్తాన్`. లెజెండ్స్ అమితాబ్ బచ్చన్ - అమీర్ ఖాన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కత్రిన - ఫాతిమా సనా షేక్ తదితరులు నటిస్తున్నారు. ఇదివరకూ ఆన్ లొకేషన్ నుంచి బందిపోటు గెటప్‌లు కొన్ని లీకయ్యాయి. అందులో అమితాబ్ - అమీర్ లుక్ ఎలా ఉంటుందో రివీలైంది. భారీగా జులపాల జుత్తు వేసుకుని భీకరాకారాలతో కనిపించారు. లీకేజీ ఫోటోలు సినిమాపై ఆసక్తి పెంచాయి.
తాజాగా సినిమా లోగోని లాంచ్ చేశారు. లోగో ఆద్యంతం విజువల్ బ్రిలియన్సీ ప్రామిస్సింగ్ గా ఉంది. ముఖ్యంగా నేపథ్య సంగీతం రక్తి కట్టించింది. రెండు స్వోర్డ్స్ (కత్తులు) ఒకదానిని ఒకటి రాపాడిస్తే పుట్టుకొచ్చే భీకర శబ్ధం ఎలా ఉంటుందో వినిపించారు. నాడు బంధిపోట్లు దాడులకు వెళ్లేప్పుడు ధరించే ఓ కవచాన్ని లోగో విజువల్స్ లో చూపించారు. ప్రతిష్ఠాత్మక యశ్ రాజ్ ఫిలింస్ సంస్థ ఈ చిత్రాన్ని రాజీ లేకుండా దాదాపు 300-400 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తోందన్న సమాచారం ఉంది. నవంబర్ 8న దీపావళి కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. థగ్స్ జేగంట మోగించారు. మరో రెండు నెలల సమయం కూడా లేదు కాబట్టి ఇకపై ప్రచారంలో వేగం పెంచనున్నారని అర్థమైంది.
Full View