ఇరు తెలుగు రాష్ట్రాల్లో టిక్కెట్టు ధరల పరంగా బెస్ట్ ఏరియా ఏది? అంటే కచ్ఛితంగా అన్ని వేళ్లు నైజామ్ నే సూచిస్తున్నాయి. గత కొంతకాలంగా అన్ని పెద్ద సినిమాలకు టిక్కెట్టు ధరలను పెంచుకునే వెసులుబాటును కేసీఆర్ ప్రభుత్వం కల్పిస్తోంది. టాలీవుడ్ హైదరాబాద్ ను వదిలి ఎటూ పోకుండా కేసీఆర్ ప్రభుత్వం అన్నివిధాలా వెసులుబాటు కల్పిస్తోందనేది వాస్తవం.
అయితే అందుకు భిన్నంగా ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఆరంభం కొంత బెట్టు చేసిన జగన్ ప్రభుత్వం ఇప్పుడు స్థిరంగా టిక్కెట్టు ధరలను కొనసాగిస్తోంది. విజయ్ దేవరకొండ నటించిన తదుపరి చిత్రం లైగర్ కి ఏపీతో పోలిస్తే నైజాంలో టిక్కెట్టు ధరల భారం చాలా ఎక్కువ అని తాజాగా పెంచిన ధరలు చెబుతున్నాయి.
తెలంగాణాలో పెరిగిన ధరలతో బహుభాషా చిత్రం లైగర్ థియేటర్లలో విడుదల కాబోతోంది. సినిమా టిక్కెట్ ధరలు (GSTతో సహా) పరిశీలిస్తే.. తెలంగాణలో సింగిల్ స్క్రీన్ - రూ.175 .. మల్టీప్లెక్స్‌ల్లో - రూ.250 వరకూ టికెట్ ధరను పెంచారు. ఇటీవలి కాలంలో విడుదలైన ఏ తెలుగు సినిమాల్లో అన్నిటికంటే ఇదే అత్యధికం. అయితే ఏపీలో టిక్కెట్ ధరలు సాధారణంగానే ఉన్నాయి. సింగిల్ స్క్రీన్ కు రూ.147.. మల్టీప్లెక్స్ కు రూ.177గా ఉంది. నైజాంలో టికెట్ ధరల పెంపుపై నెటిజనులు ఇప్పటికే విరుచుకుపడుతున్నారు. లైగర్ మోస్ట్ అవైటెడ్ మూవీ కాబట్టి ఇక్కడ టిక్కెట్ ధరల పెంపును తీవ్రంగా నిరశిస్తున్నారు. అయితే దేవరకొండ టీమ్ కి ఈ పెంపు ఎంతో కలిసొస్తుందనడంలో సందేహం లేదు. ఇక టాలీవుడ్ పై తెలంగాణ ప్రభుత్వం అవిభాజ్య ప్రేమతో కనికరిస్తున్నా ఏపీ ప్రభుత్వం నుంచి మాత్రం ఈ కనికరం లేదన్న వ్యాఖ్యలు ఇండస్ట్రీలో ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయి.
విజయ్ దేవరకొండ- అనన్య పాండే జంటగా నటించిన లైగర్ లో మైక్ టైసన్,- రమ్య కృష్ణన్ - విషు రెడ్డి తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. లైగర్ తో అనన్య పాండే కథానాయికగా టాలీవుడ్ కి పరిచయం అవుతోంది. ధర్మ ప్రొడక్షన్స్ తో కలిసి పూరి కనెక్ట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. 25 ఆగస్టు 2022 న ప్రేక్షకుల ముందుకు రానుంది.