`సాహో` టికెట్ బుకింగ్ ప్రహసనం ప్రస్తుతం సామాన్యుల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమా రిలీజ్ ముందే ఏపీలో టిక్కెట్ రేట్లు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది. అయితే అక్కడ లభించినట్టుగా తెలంగాణలో మాత్రం ఉదారంగా అనుమతులు లభించలేదు. ఏపీలో వేసుకున్నట్టు విచ్చలవిడి ప్రీమియర్లు.. ఆరు షోలు వగైరా ఇక్కడ లేనే లేవు. అదొక్కటే కాదు ఇక్కడ ప్రీమియర్లకు అనుమతులు ఇవ్వలేదు. దాంతో పాటే టిక్కెట్టు ధరల పెంపునకు ప్రభుత్వం ససేమిరా అనేసిందని తెలుస్తోంది. ఈ కారణం వల్ల నైజాం వరకూ తొలి మూడు రోజుల్లోనే జనాల నుంచి రిటర్నులు దక్కించుకునే స్కీములకు ఆస్కారం లభించలేదు.
రకరకాల కారణాలతో హైదరాబాద్ లాంటి చోట్ల పలు ప్రైమ్ ఏరియాల్లో ఉన్న మల్టీప్లెక్సుల్లో సాహో టిక్కెట్లు దొరకలేదు. బుక్ మై షో సహా ఆన్ లైన్ వెబ్ సైట్లు ఓపెన్ కాలేదు. ఇనార్బిట్- ప్రసాద్స్ ఐమ్యాక్స్ - సినీమ్యాక్స్ వంటి కొన్ని ఇంపార్టెంట్ థియేటర్లకు టిక్కెట్లు బుక్ చేసుకునే వెసులుబాటు రిలీజ్ కి రెండ్రోజుల ముందు కనిపించలేదు. ఇక ఇతర మల్టీప్లెక్సుల్లో ఒక్కో టిక్కెట్టు ధర రూ.175 (అత్తాపూర్ ఏషియన్ లో) పలికింది. ప్రస్తుతం ఇనార్బిట్ మాల్- ప్రసాద్స్ ఐమ్యాక్స్ ఆన్ లైన్ టికెటింగ్ అందుబాటులోనే ఉంది. టిక్కెట్టు ధర రూ.200 గా కనిపిస్తోంది. వాస్తవానికి మల్టీప్లెక్స్ థియేటర్లలోనూ రూ.150 -160 ఉండాల్సింది. ఇప్పుడు ధరలు కాస్త పెంచారనే అర్థమవుతోంది.
అయితే నైజాంలో టిక్కెట్టు పెంపు అనుమతులు వచ్చాయా? రాకుండానే వీళ్లంతా పెంచుకున్నారా? అన్నదానిపైనా సరైన క్లారిటీ లేనేలేదు. ఇంతకుముందు మహేష్ నటించిన భారీ చిత్రం `మహర్షి` కోసం ఎగ్జిబిటర్లు ఇష్టానుసారం టిక్కెట్టు ధరలు పెంచుకుని షోలు వేయడంతో అప్పట్లో తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ సీరియస్ అయ్యారు. వినోదం పేరుతో దోపిడీ తగదని.. ప్రభుత్వ అనుమతి లేకుండా ఇలా ఎలా పెంచారు? అంటూ ప్రశ్నించారు. అయితే దిల్ రాజు లాంటి ప్రముఖుడు నైజాంలో రిలీజ్ చేయడం వల్ల ఆ తర్వాత ఆ వివాదం కన్ క్లూజన్ అన్నదే లేకుండా పోయింది. దిల్ రాజు సైతం టిక్కెట్టు పెంపు కోసం ఎగ్జిబిటర్- పంపిణీ వర్గాలే కోర్టుకు వెళతాయని తమకు సంబంధం ఉండదని సరిపుచ్చారు. ఇప్పుడు యు.వి.క్రియేషన్స్ సంస్థ అత్యంత భారీ బడ్జెట్ తో సినిమా తీసినా తెలంగాణ ప్రభుత్వం నుంచి అనుమతులకు ససేమిరా అన్న మాటే వినిపించింది. అయినా దానిని భేఖాతర్ చేసి టిక్కెట్టు ధరల్ని పెంచుతున్నారా.. అన్నఆరాలు తీస్తున్నారని తెలుస్తోంది.