ఇంగ్లడ్ సింగర్ కం లిరిక్ రైటర్ ఎడ్ షీరన్.. ఇండియా టూర్ వస్తున్నాడు. ముంబైలో ఎడ్ షీరన్ లైవ్ కాన్సర్ట్ జరగనుంది. ఈ కాన్సర్ట్ కి సంబంధించిన టికెట్స్ ను.. రీసెంట్ గా బుక్ మై షో ద్వారా విక్రయానికి ఉంచితే.. రికార్డ్ సమయంలో అన్నీ ఫుల్ అయిపోయాయి.
కేవలం 48 నిమిషాల్లో అన్ని క్లాసులకు చెందిన టికెట్స్ అమ్ముడైపోయినట్లు బుక్ మై షో వర్గాలు చెబుతున్నారు. మొదటగా డైమండ్.. అ తర్వాత గోల్డ్.. సిల్వర్ క్లాస్ లకు చెందిన టికెట్స్ సేల్ అయ్యాయని తెలిపారు. తన మూడవ స్టూడియో ఆల్బం డివైడ్ కు ప్రచారం కల్పించేందుకు గాను.. ప్రస్తుతం వరల్డ్ టూర్ లో ఉన్నాడు ఎడ్ షీరన్. ఈ టూర్ లో భాగంగానే ఇండియాలో ఓ షో ఏర్పాటు చేయగా.. దీనికి ఈతని ఫ్యాన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ డిమాండ్ ను ముందుగానే అంచనా వేశామని. ముంబైలో షీరన్ కాన్సర్ట్ కు టికెట్స్ బుకింగ్ తగినంతగా ముందే ప్రిపేర్ అయ్యామని అంటున్నారు నిర్వాహకులు. ఫస్ట్ కం ఫస్ట్ సర్వ్ బేసిస్ లో టికెట్స్ సేల్ అయ్యేలా జాగ్రత్తలు తీసుకున్నారట. వేలాది మందికి టికెట్స్ లభ్యమయ్యేలా తమ వర్చువల్ క్యూ మేనేజ్మెంట్ సిస్టం సహాయపడిందని లైవ్ ఈవెంట్స్ విభాగానికి చెందిన వారు చెబుతున్నారు.
ఎడ్ షీరన్ కాన్సర్ట్ టికెట్స్ ను రీసేల్ చేయచ్చని.. అయితే అది కొన్న ధరకే చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. కొనుగోలు ధర కంటే తక్కువ.. ఎక్కువ అయితే అంగీకరించబోమని.. ఇలాంటి విక్రయాలపై కన్నేసి ఉంచామని చెబుతుండడం విశేషం.