లండన్‌ వీధుల్లో టైగర్ హై ఓల్టేజ్‌ యాక్షన్‌

Update: 2021-09-10 09:30 GMT
బాలీవుడ్ యాక్షన్ హీరో అనగానే వెంటనే వినిపించే పేర్లలో టైగర్ ష్రాఫ్‌ పేరు ముందు వరుసలో ఉంటుంది అనడంలో సందేహం లేదు. వరుసగా యాక్షన్‌ ప్రధాన చిత్రాలను చేస్తూ ఇండియన్‌ యాక్షన్‌ హీరో అంటూ పేరు దక్కించుకున్నాడు. ప్రస్తుతం ఈయన హీరోపంతి 2 సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. బాలీవుడ్ ప్రేక్షకులు ఈ సినిమాపై అంచనాలు ఆకాశమే హద్దు అన్నట్లుగా పెంచేసుకున్నారు. అంతటి అంచనాలున్న ఈ సినిమా కోసం భారీ యాక్షన్‌ సన్నివేశాలను డిజైన్ చేస్తున్నారు. టైగర్ ష్రాఫ్‌ సినిమా అంటే అంతా కూడా యాక్షన్‌ సన్నివేశాలను ప్రధానంగా ఆశిస్తారు. కనుక ఈ సినిమా లో ప్రేక్షకులు కోరుకున్న రేంజ్ లో యాక్షన్‌ సన్నివేశాలు ఉంటాయని అంటున్నారు.

ప్రస్తుతం లండన్‌ వీధుల్లో భారీ యాక్షన్‌ సన్నివేశాలు తెరకెక్కించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. హాలీవుడ్ యాక్షన్‌ కొరియోగ్రాఫర్స్ తో పాటు అంతర్జాతీయ స్థాయి లో గుర్తింపు దక్కించుకున్న పైటర్లను ఈ సినిమా కోసం వినియోగించబోతున్నారు అనేది టాక్‌. ప్రస్తుతం సినిమా కు సంబంధించిన కీలక యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుపుతున్నారు. అది కనుక పూర్తి అయితే సినిమా మెజార్టీ పార్ట్‌ పూర్తి అయినట్లుగా అవుతుందని మేకర్స్ అంటున్నారు. టైగర్ ను ఈ సినిమాలో ఎలా చూడబోతున్నారు అనే విషయాన్ని అతి త్వరలోనే చూపించేందుకు కూడా మెకర్స్ రెడీ అవుతున్నారట.

యాక్షన్‌ సన్నివేశాల చిత్రీకరణ కోసం నిర్మాతలు భారీ ఎత్తున ఖర్చు చేయబోతున్నారట. ఈమద్య కాలంలో ఏ బాలీవుడ్‌ సినిమాలో కూడా యాక్షన్‌ సన్నివేశాలకు ఇంతగా ఖర్చు చేసి ఉండరు అన్నట్లుగా ఈ సినిమాలో యాక్షన్‌ సన్నివేశాలు ఉంటాయని అంటున్నారు. తార సుతారి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా లో రొమాన్స్ తో పాటు ఎంటర్‌ టైనర్‌ యాక్షన్‌ అన్ని ఉంటాయని మేకర్స్ ప్రధానంగా చెబుతున్నారు. టైగర్ కు మంచి పేరు తీసుకు వచ్చిన హీరోపంతికి ఇది సీక్వెల్‌ అవ్వడం వల్ల ఇండస్ట్రీలో ఈ సినిమా పై ఆసక్తి ఉంది. దానికి తోడు మేకర్స్ సినిమాను ఓ రేంజ్ లో రూపొందిస్తున్న కారణంగా అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.




Tags:    

Similar News