వెటరన్ స్టార్.. నిర్మాత జాకీష్రాఫ్ తనయుడు టైగర్ ష్రాఫ్ వెండితెర విన్యాసాలు.. స్టైలిష్ డ్యాన్సులు.. గగుర్పొడిచే భారీ స్టంట్ సీన్ల గురించి అభిమానులు నిరంతరం ముచ్చటించుకుంటార. మార్షల్ ఆర్ట్స్ లో టైగర్ గొప్ప నిపుణుడు. ఒక రకంగా అతడికి జాకీఛాన్- సిల్వస్టర్ స్టాలోన్ కి ఉన్నంత ఫాలోయింగ్ ఉంది బాలీవుడ్ లో.
అయితే టైగర్ గురించి తెలుసుకోవాల్సిన స్ఫూర్తివంతమైన విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. అతడు నిజ జీవితంలోను రియల్ ఛాలెంజర్. నిజానికి టైగర్ 11 ఏళ్ల వయసులోనే లైఫ్ లో రియల్ ఛాలెంజ్ ని ఎదుర్కొన్నాడు. ఆ సమయంలో అతడి కష్టం ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
టైగర్ మాట్లాడుతూ..''నేను పదకొండు ప్రాయంలో ఉన్నప్పుడు మా అమ్మా నాన్న ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న రోజులవి. 2003లో బూమ్ (అమితాబ్-కత్రిన) సినిమా రిలీజైంది. ఆ సినిమాని మా అమ్మగారు అయేషా ష్రాఫ్ నిర్మించారు. ఆ సినిమా థియేటర్లలోకి రాకముందే ఆన్ లైన్ లో లీకైపోయింది. దాంతో అది పెద్ద ఫ్లాపై మా కుటుంబాన్ని ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టింది. అప్పట్లోనే ఓ సంఘటన నాకు గుర్తుంది. నా ముందే ఇంట్లో ఉన్న ఫర్నీచర్ అంతా ఒకటొకటిగా అమ్మేస్తున్నారు నాన్న. కళ్ల ముందే అన్నీ పోతున్నాయి. చివరికి నేను నిదురించే బెడ్డును కూడా అమ్మేశారు. దాంతో నేలపై పడుకున్నాను.. ఆ సన్నివేశం అలా కళ్ల ముందే ఉండిపోయింది'' అని నాటి విషయాలను గుర్తు చేసుకున్నారు. బహుశా ఆ రోజే టైగర్ కి కష్టం అంటే ఏమిటో తెలిసింది. అప్పటి నుంచి అతడు కసిగా బాలీవుడ్ లో స్టార్ అయ్యేందుకు ఎంతగానో శ్రమించాడు.
బాలీవుడ్ లో ఉన్న నవతరం స్టార్లలో ఎంతో హార్డ్ వర్కర్ గా టైగర్ కి పేరుంది. అతడి కమిట్ మెంట్ అందరికీ షాకిస్తుంటుంది. యాక్షన్ హీరోగా నిరూపించుకునేందుకు చాలా శారీరక శ్రమను చేస్తుంటాడు. హీరో పాంటీ అనే సినిమాతో కథానాయకుడిగా పరిచయం అయిన టైగర్ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. వార్ సినిమాలో గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ తోనే పోటీపడి నటించి మెప్పించాడు. యాక్షన్ హీరో అంటే టైగర్ ష్రాఫ్ అనేంతగా గుర్తింపు తెచ్చుకున్నాడు. భాఘి సిరీస్ తో పాటు వార్ లో అతడి నటనను అభిమానులు అంత తేలిగ్గా మర్చిపోలేరు. ఇటీవల టైగర్ ఇజ్రాయేల్ లో మార్షల్ ఆర్ట్స్ నిపుణుల సమక్షంలో రకరకాల స్టంట్స్ నేర్చుకుని తిరిగి వచ్చాడు. జీవితంలో ప్రతి నిమిషం ఏదో ఒకటి నేర్చుకుంటూ తన స్థాయిని అంతకంతకు పెంచుకుంటున్న ఈ హీరో అందరికీ స్ఫూర్తి. నిజ జీవితంలో రియల్ ఛాలెంజ్ లను ఎదుర్కొని కసితో ఎదిగిన హీరోగా టైగర్ గురించి నిరంతరం చర్చ సాగుతూనే ఉంది.
తన తండ్రి జాకీ ష్రాఫ్ దివాలా తీసిన క్రమంలోనే టైగర్ ఆ ఇంటిని తిరిగి కొనుగోలు చేస్తానని తన తల్లిగారికి వాగ్దానం చేశాడట. ఈ విషయాన్ని టైగర్ తల్లిగారైన అయేషా ష్రాఫ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆయేషా ష్రాఫ్ బూమ్ ఫ్లాప్ అయిన తర్వాత ష్రాఫ్ కుటుంబం ఒక పెద్ద పరీక్షను ఎదుర్కొంది. ఆ సమయాన్ని గుర్తు చేసుకుంటూ టైగర్ ష్రాఫ్ తనకు ఎలా అండగా నిలిచాడనే దాని గురించి ఆమె మాట్లాడింది.
పరిశ్రమకు దూరంగా ఉన్న అయేషా ష్రాఫ్.. తాను అమితాబ్ బచ్చన్ - గుల్షన్ గ్రోవర్ నటించిన మల్టీ స్టారర్ బూమ్ ను రూపొందించిన సమయాన్ని గుర్తుచేసుకుంది. ''నేను కొన్నాళ్ల క్రితం బూమ్ అనే సినిమా తీశాను. ఆ సినిమా అంటే నాకు చాలా ఇష్టం. కానీ దురదృష్టవశాత్తూ ఆ సినిమా పైరసీకి గురై డిస్ట్రిబ్యూటర్లు వెనక్కి తగ్గారు. సినిమా డెలివరీ తీసుకోవడానికి వారు నిరాకరించారు. అది మా కుటుంబ గౌరవం.
సినిమాను విడుదల చేసేందుకు ఉన్నదంతా ఖర్చు చేశాం'' అని తెలిపారు. మా ఇంటిని లీజుకు ఇచ్చి సినిమాను విడుదల చేశాం. వాస్తవానికి మేము ఆ ఇంటిని కోల్పోయాము. ఆ తర్వాత టైగర్ సినిమా రంగంలోకి వచ్చినప్పుడు అతను నాకు మొదట చెప్పిన విషయం ఏమిటంటే ''నేను మీ కోసం ఆ ఇల్లు కొనబోతున్నాను'' అని అన్నాడు. నాకు ఖరీదైన వజ్రాలు కొనివ్వడం కంటే ఆ ప్రేమ ప్రకటన చాలా ఎక్కువ. తన వాగ్దానానికి కట్టుబడి టైగర్ తన కుటుంబం కోసం ఇంటిని కొనుగోలు చేశాడని తెలిపారు.
బూమ్ సినిమాతోనే బాలీవుడ్ లో కత్రినా కైఫ్ రంగ ప్రవేశం చేసింది. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విఫలమైంది, ఇది చివరికి ష్రాఫ్ కుటుంబానికి భారీ నష్టాలను తెచ్చిపెట్టింది. ష్రాఫ్ కుటుంబం దివాళా తీసింది. తాను ఆ సమయంలో చిన్నపిల్లగా ఉన్నందున నిస్సహాయంగా ఉండిపోయానని టైగర్ పబ్లిక్ వేదికలపైనే పలుమార్లు గుర్తుచేసుకున్నాడు. ఆ తర్వాత తన తల్లికి ఇచ్చి మాట ప్రకారం కోల్పోయిన ఇంటిని తిరిగి కొనిచ్చాడు. అలా రియల్ ఛాలెంజర్ అని నిరూపించాడు.
టైగర్ ష్రాఫ్ ప్రస్తుతం గణపత్ లో నటిస్తున్నాడు. సిద్ధార్థ్ ఆనంద్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఇది. సిల్వెస్టర్ స్టాలోన్ మూవీ-సిరీస్ రాంబోకి రీమేక్ ఇది. బడే మియాన్ చోటే మియాన్ రీమేక్ లోను నటిస్తున్నాడు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.