నిజానికి తెలుగు సినిమాలను అమితంగా ప్రేమించేవారు ఇప్పుడంటే బాహుబలి గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు కాని.. మొన్నటివరకు కంటెంట్ పరంగా తమిళ సినిమాలు చాలా డామినేట్ చేశాయి. మరీ ముఖ్యంగా కొత్త కొత్త జానర్లను కొత్త కొత్త పందా కథలను ఎంచుకోవడంలోవాళ్ళు ఎందుకో ఒక వరుస ముందున్నారు. అదే కోవకు చెందుతుంది ఇప్పుడొస్తున్న 'టిక్ టిక్ టిక్' సినిమా కూడా.
ఆకాశంలో నుండి ఒక ఉల్క భూగోళాన్ని తాకుతుంది. ఇక మరో 60 రోజుల్లో అంతకంటే పెద్దదైన ఉల్క పడి.. మన భూమ్మీద ఒక సిటీ లేకుండా మాయమైపోతుంది అంటే మీకు ఎలా ఉంటుంది? అలాంటి ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఆ ఉల్క మీదకు మనమే ఒక స్పేస్ షెటిల్ పంపేసి దానిని బ్లాస్ట్ చేయాలి. సరిగ్గా ఇదే మన చినప్పుడు 90లలో వచ్చిన 'ఆర్మగెడాన్' సినిమా కథ. ఇప్పుడు అదే కథను తీసుకుని.. పైన స్పేస్ లోకి వెళ్ళి ఆ ఉల్కను బ్లాస్ట్ చేయాలంటే ఒక మిస్సైల్ కావాలి కాబట్టి.. దానిని ఒక చైనా స్టేషన్ నుండి దొబ్బేయడానికి ఒక మెజీషియన్ (జయం రవి)ను పంపిస్తారు. అతనితోపాటు ఇతర ఆస్ర్టోనాట్స్ (వోమగాములు) కూడా వెళతారు. అక్కడ వారేం చేస్తారు అనేదే కథ.
విజువల్స్ పరంగా మనం ఇప్పటివరకు చూసిన హాలీవుడ్ స్టాండర్డ్స్ ను క్రియేట్ చేసే పనిలో దర్శకుడు శక్తి సౌందర్ రాజన్ బాగానే సక్సెస్ అయ్యాడు. అలాగే జయం రవి కూడా ఒక కాన్ ఆర్టిస్టుగా బాగానే మెప్పించాడు. థ్రిల్లర్ ను తలపించే స్ర్కీన్ ప్లే.. హాలీవుడ్ తరహా విజువల్స్.. ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్. ట్రైలర్ చూస్తుంటే ఈ స్పేస్ సినిమా ఖచ్చితంగా ఇరగదీస్తుందనే అనిపిస్తోంది.