టిల్లు 2..అన్నీ వివాదాలే..అట్లుంట‌ది మంతోని!

Update: 2022-11-29 06:11 GMT
సిద్దూ జొన్న‌ల‌గ‌డ్డ న‌టించిన 'డీజే టిల్లు' ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో విడుద‌లై చిన్న సినిమాల్లో పెద్ద విజ‌యాన్ని సొంతం చేసుకుంది. విమ‌ల్ కృష్ణ డైరెక్ట్ చేసిన ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ట్ చేసి వ‌సూళ్లు చూసి ట్రేడ్ వ‌ర్గాలే విస్తూ పోయాయి. 10 కోట్ల లోపు బ‌డ్జెట్ తో చేసిన ఈ మూవీ ఓవ‌రాల్ గా వ‌ర‌ల్డ్ వైడ్ గా రూ. 50 కోట్లు వ‌సూళ్ల‌ని రాబ‌ట్టి చిన్న సినిమాల్లో పెద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ అనిపించుకుంది. ఇంత‌గా వ‌సూళ్ల వ‌ర్షం కురిపించిన ఈ మూవీకి సీక్వెల్ ని చేయాల‌నుకున్నారు.

హీరోగా న‌టిస్తున్న సిద్ధూ జొన్న‌ల‌గ‌డ్డ ఈ మూవీ స్క్రిప్ట్ వ‌ర్క్ లోనూ త‌న ముద్ర వేశాడు. అంతే కాకుండా త‌న‌కు ఫుల్ ఫ్రీడ‌మ్ కావాల‌నే కండీష‌న్ పెట్టాడ‌ట‌. దీంతో ఈ ప్రాజెక్ట్ నుంచి ద‌ర్శ‌కుడు విమ‌ల్ కృష్ణ స్క్రిప్ట్ ద‌శ‌లోనే త‌ప్పుకోవ‌డంతో ఆ స్థానంలో మ‌ల్లిక్ రామ్ ని డైరెక్ట‌ర్ గా ఫిక్స్ చేసుకున్నారు.

ఆ త‌రువాత హీరోయిన్ మారింది. ముందు ఇందులో నేహాశెట్టికి బ‌దులు శ్రీ‌లీల‌ని అనుకున్నారు. టాక్స్ జ‌రిగాయి. ఫైన‌ల్ అనుకున్నారు..కానీ ఎందుకో త‌ను కూడా ఈ ప్రాజెక్ట్ నుంచి వెళ్లిపోయింది.  

ఆ త‌రువాత ఫైన‌ల్ గా అనుప‌మ ప‌ర‌మేశ్వ‌న్ ని ఫిక్స్ చేసుకున్నారు. రీసెంట్ గా షూటింగ్ మొద‌లైంది. అయితే అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ కూడా ఈ ప్రాజెక్ట్ కు గుడ్ బై చెప్పేసింది. కార‌ణం సెట్ లో సిద్ధూ జొన్న‌ల‌గ‌డ్డ‌తో త‌న‌కు ప‌డ‌టం లేద‌ట‌. ప్ర‌తీ విష‌యంలోనూ ఇద్ద‌రి మ‌ధ్య ఆర్గ్యూమెంట్స్ ఎక్కువ‌గా అవుతున్నాయ‌ట‌. అది పీక్స్ కి చేర‌డంతో అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ కూడా ఈ ప్రాజెక్ట్ నుంచి త‌ప్పుకుంద‌ని తెలిసింది.

ఇప్ప‌డు త‌న స్థానంలో 'ప్రేమ‌మ్‌' బ్యూటీ మ‌డోన్నా సెబాస్టియ‌న్ ని తీసుకున్నార‌ట‌. 'డీజే టిల్లు' ఊహించ‌ని విధంగా బ్లాక్ బ‌స్ట‌ర్ కావ‌డంతో సిద్ధూ జొన్న‌ల‌గ‌డ్డ‌కు నిర్మాత సీక్వెల్ విష‌యంలో ఫ్రీ హ్యాండ్ ఇచ్చాడ‌ట‌. అదే ఇప్ప‌డు 'టిల్లు 2'కు త‌ల‌నొప్పులు తెచ్చిపెడుతోంద‌ని తెలుస్తోంది. ప్రాజెక్ట్ ప్రారంభం నుంచే సిద్దూ డామినేట్ చేయ‌డం మొద‌లు పెట్టాడ‌ట‌. ప్ర‌తీ విష‌యంలోనూ త‌న మార్కు వుండాల‌ని ప‌ట్టుబ‌డుతున్నాడ‌ట‌.

ఆ కార‌ణంగానే సీక్వెల్ పై వ‌రుస వివాదాలు చుట్టుముడుతున్నాయని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు కామెంట్ చేస్తున్నాయి. ఇదిలా వుంటే ఎన్ని వివాదాలు చుట్టుముబ‌డుతున్నా 'డీజే టిల్లు' కార‌ణంగా 'టిల్లు 2'పై భారీ ఎక్స్ పెక్టేష‌న్స్ వున్న‌ట్టుగా తెలుస్తోంది. ఈ మూవీని త్వ‌ర‌గా పూర్తి చేసి 2023 స‌మ్మ‌ర్ కు ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని నిర్మాత సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ ప్లాన్ చేస్తున్నాడు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News