రామారావు రిపోర్టింగ్ కి టైమ్..డేట్ ఫైన‌ల్‌

Update: 2022-03-23 06:32 GMT
మాస్ మ‌హారాజా న‌టించిన మ‌రో ఇంటెన్స్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ 'రామారావు ఆన్ డ్యూటీ'. గ‌త కొంత కాలంగా వ‌రుస ఫ్లాపుల్ని సొంతం చేస‌పుకున్న ర‌వితేజ 'క్రాక్‌'తో త‌న‌దైన స్టైల్ యాక్ష‌న్ డ్రామాతో మ‌ళ్లీ బౌన్స్ బ్యాక్ అవ్వ‌డ‌మే కాకుండా క్రేజీగా ఫామ్‌లోకి వ‌చ్చేశారు. అయితే మ‌ధ్య‌లో 'ఖిలాడీ' డీలా ప‌డేలా చేసినా రెట్టించిన ఉత్సాహంతో 'రామారావు ఆన్ డ్యూటీ' అంటూ ప‌వ‌ర్ ఫుల్ మూవీతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుతున్నాడు. ఈ హై వోల్టేజ్ ఇంటెన్స్ డ్రామాతో శ‌ర‌త్ మండ‌వ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు.

'జై భీమ్‌' ఫేమ్ రాజీషా విజ‌య‌న్‌, 'మ‌జిలీ' ఫేమ్ దివ్యాన్ష కౌశిక్ హీరోయిన్ లుగా న‌టిస్తున్నారు. వేణు తొట్టెంపూడి రీఎంట్రీ ఇస్తున్న చిత్ర‌మిది. ఎస్ ఎల్ వీ సినిమాస్ , ఆర్ టి టీమ్ వ‌ర్క్స్ బ్యాన‌ర్ ల‌పై సుధాక‌ర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మాస్ రాజా ర‌వితేజ డిప్యూటీ క‌లెక్ట‌ర్ గా ప‌వ‌ర్ ఫుల్ పాత్ర‌లో న‌టిస్తున్న ఈ మూవీ చిత్రీక‌ర‌ణ మొత్తం పూర్త‌యింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో చిత్ర బృందం బుధ‌వారం ఈ చిత్ర రిలీజ్ డేట్ ని ప్ర‌క‌టించింది.

వ‌ర‌ల్డ్ వైడ్ గా ఈ మూవీని జూన్ 17న అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్న‌ట్టుగా ప్ర‌క‌టించారు. ముందు ఈ మూవీ రిలీజ్ ని ఏప్రిల్ లేదా మేలో అనుకున్నారు. కానీ ప్ర‌మోష‌న్స్ కి టైమ్ కుద‌ర‌ద‌ని భావించ‌డంతో జూన్ కి రిలీజ్ డేట్ ని మార్చేశారు. రిలీజ్ డేట్ ని ప్ర‌క‌టిస్తూ మేక‌ర్స్ రిలీజ్ చేసిన తాజా పోస్ట‌ర్ లో హీరో ర‌వితేజ లుక్ చాలా ఇంటెన్స్ తో క‌నిపిస్తోంది.

ట్ర‌క్స్ ఫారెస్ట్ లో పాస్ అవుతుండ‌గా ర‌వితేజ వాటిని తీక్ష‌ణంగా చూస్తున్న లుక్ ఆక‌ట్టుకుంటోంది. రామారావు అనే ప‌వ‌ర్ ఫుల్ పాత్ర‌లో ర‌వితేజ న‌టిస్తున్న చిత్ర‌మిది. విక్ర‌మార్కుడు, క్రాక్ చిత్రాల త‌ర‌హాలో ర‌వితేజ పాత్ర ఇందులో ప‌వర్ ఫుల్ గా సాగ‌నుంది.

ఈ మూవీతో హీరో వేణు మ‌రో సారి రీ ఎంట్రీ ఇవ్వ‌బోతున్నారు. గ‌తంలో ఎన్టీఆర్ న‌టించిన 'ద‌మ్ము' చిత్రంతో రీఎంట్రీ ఇచ్చారు. అయితే అది ఆయ‌న కెరీర్ కి పెద్ద‌గా ఉప‌యోగ‌ప‌డ‌లేక‌పోయింది. దీంతో మ‌రోసారి సెకండ్ ఇన్నింగ్స్ ని ఈ మూవీతో స్టార్ట్ చేస్తున్నారు. ఇటీవ‌ల విడుద‌ల చేసిన ఈ చిత్ర టీజ‌ర్ సినిమాలో ర‌వితేజ పాత్ర ఎంత ప‌వ‌ర్ ఫుల్ గా వుంటుందో స్ప‌ష్టం చేసింది. అంతే కాకుండా సినిమాపై ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తిని పెంచేసింది.

ప‌వర్ ఫుల్ యాక్ష‌న్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రానికి సామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నారు. త్వ‌ర‌లోనే లిరిక‌ల్ వీడియోల‌తో ప్ర‌మోష‌న్స్ ని స్టార్ట్ చేయ‌బోతున్నారు. ప‌విత్రా లోకేష్‌, నాజ‌ర్‌, జాన్ విజ‌య్‌, సీనియ‌ర్ న‌రేష్‌, చైత‌న్య కృష్ణ‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, రాహుల్ రామ‌కృష్ణ‌, ఈరోజుల్లో శ్రీ‌, మ‌ధు సుద‌న్ రావు, సురేఖ వాణి కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.
Tags:    

Similar News