టాలీవుడ్ లో పెరుగుతోన్న ఓటీటీ రిలేటెడ్ అవకాశాలు నటీనటులకు పెద్ద అడ్వాంటేజ్ గానే కనిపిస్తోంది. క్రైసిస్ మొదలైన నాటి నుంచి టాలీవుడ్ ప్రముఖులు సొంత ఓటీటీలపై ఆసక్తి చూపిస్తున్నారు. అవకాశం ఉన్న బడా ఎంటర్ ప్రెన్యూర్స్ సొంతంగా ఓటీటీలు ఏర్పాటు చేసుకోవాలని భావిస్తున్నారు. ఇప్పటికే అల్లు అరవింద్ `ఆహా` తో బెస్ట్ కంటెంట్ ని అందించే ప్రయత్నం చేస్తోన్న సంగతి తెలిసిందే. సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లతను ఆహా లో రిలీజ్ చేస్తూ అల్లు అరవింద్ తన ఆలోచన సరైనదేనని నిరూపిస్తున్నారు. కంటెంట్ బాగుంది అనుకుంటే కొంత రిస్క్ చేయడానికి సైతం ఆహా వెనుకడుగు వేయలేదు.
ఇప్పటికే స్ట్రెయిట్ ఒరిజినల్ కంటెంట్ తో పాటు అనువాద చిత్రాలతోనూ ఆహా తనదైన మార్క్ వేస్తోంది. గొప్ప ఆదరణ పొందిన సినిమాలు ఆహాలో ఉన్నాయి. తాజాగా ఈ నెల 16న రిలీజ్ అయిన `కుడి ఎడమైతే` అనే వెబ్ సిరీస్ తోను మరో సక్సెస్ దక్కింది. ఇందులో అమలాపాల్- రాహుల్ విజయ్ జంటగా నటించారు. `యూటర్న్` చిత్ర దర్శకుడు పవన్ కుమార్ తెరకెక్కించారు. అమలాపాల్ పలు వెబ్ సిరీస్ లలో నటించినా ఆ ఇద్దరికి ఇది తొలి ప్రయత్నం. వెబ్ సిరీస్ మొదటి ప్రయత్నంలో సక్సెస్ అయి చూపించడంతో సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. పవన్ కుమార్ మంచి కంటెంట్ తో తెరకెక్కించారు కాబట్టే సక్సెస్ అందుకున్నారంటూ నెటి జనులు సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపిస్తున్నారు.
డిఫరెంట్ జోనర్ అయిన టైమ్ లూప్ డ్రామా కంటెంట్ తో తెరకెక్కిన `కుడి ఎడమైతే` లో ప్రతీ పాత్రను చాలా ఆసక్తికరంగా మలిచారు. ఇందులో అమలాపాల్ కఠినమైన పోలీస్ అధికారిణి పాత్రలో కనిపిస్తారు. ఆమె కథలో పాత్ర నేరేషన్ ఎంతో ఆసక్తికరంగా మలుపు తిరుగుతుంది. అనుకోకుండా ఆమె ప్రొఫెషనల్.. పర్సనల్ లైఫ్ లో జరిగే సంఘటనలపై అమలాపాల్ ఎలా పోరాటం చేసారన్నది ఆసక్తికరంగా చూపించడంతో ప్రశంసలు కురుస్తున్నాయి.