విక్కీకౌశల్-కత్రినా కైఫ్ వివాహం ఈనెల 9న రాజాస్థాన్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. దేశంలోనే అత్యంత ఖరీదైన హోటల్స్ లొ ఒకటైన సిక్స్ సెన్సెస్ పోర్ట్ అందుకు వేదికైంది. బాలీవుడ్ సెలబ్రిటీల పెళ్లిళ్లు ఎక్కువగా రాజాస్థాన్ లోనే జరుగుతుంటాయి. ఖరీదైన సుందరవనమైన కట్టడాలకు రాజస్థాన్ ప్రసిద్ధి.
అందుకే సెలబ్రిటీలు ఆ రాష్ట్రాన్ని ఎంపిక చేసుకుంటారు. విక్కీ-క్యాట్ వివాహానికి కూడా అదే కారణం. అయితే ఈ మొత్తం ప్లానింగ్ వెనుక ఓ ప్రముఖ వ్యక్తి ఉన్నారని ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఫేమస్ వెడ్డింగ్ ప్లానర్..ముంబైకి చెందిన పారిశ్రామికవేత్త టీనా ధర్వాణీ ఈ మొత్తం తతంగాన్ని ముందుండి నడిపిస్తున్నారు.
వేదికగా సిక్స్ సెన్సెస్ ని ఎంపిక చేయడం..పెళ్లి..మెహందీ ప్లానింగ్...గెస్స్ట్ ఇన్విటేషన్ ప్రీ వెడ్డింగ్ ఇలా విక్కీ-క్యాట్ కి బ్యాక్ బోనులా టీనా నిలిచారు. విక్కీ-క్యాట్ పెళ్లి చేసుకోవాలని నిర్ణయం అనంతరం టీనా ఎంటర్ అయ్యారు. ఆరు నెలలుగా టీన్ వెడ్డింగ్ కి సంబంధించిన పనుల్లో నిమగ్నమైనట్లు తెలుస్తోంది.
అప్పటి నుంచి గ్రౌండ్ వర్కౌ చేసుకుంటూ వస్తున్నారు. సాధారణంగా టీనా వివాహాలకు సంబంధించి ప్లానింగ్ జరగాలంటే 6 నుంచి 18 నెలలు సమయం పడుతుందిట. ఆమె కంపెనీ ఏడాదికి 10-12 పెళ్లిళ్లు చేస్తుందిట. టీనా బిజినెస్ ప్రధానంగా సమ్మర్ నెలలని తెలుస్తోంది. 2015 లో టీనా-మనోజ్ మల్హోత్రా- సౌరభ్ మల్హోత్రా భాగస్వామ్యంలో షాదీ స్క్వాడ్ ని ముంబైలో ప్రారంభించారు.
ఇప్పటికే కొందరు సెలబ్రిటీల పెళ్లిళ్లు కూడా ఆమె దగ్గరుండి జరిపించారు. విరాట్ కొహ్లీ- అనుష్క శర్మ..ప్రియాంక చోప్రా-నిక్ జోనాస్ పెళ్లిళ్లను కూడా టీనా బృందమే జరిపించింది. టీనా పారిశ్రామిక వేత్తనే కాదు. మంచి క్రియేటివిటీ ఉన్న వ్యక్తి కూడా. కొన్ని టీవీ ప్రకటనల్ని డైరెక్ట్ చేసారు. కొన్ని బాలీవుడ్ చిత్రాలకు సహాయ దర్శకురాలిగాను పనిచేసారు. ఆ తర్వాత సెలబ్రిటీ మేనేజర్ గా టర్న్ అయ్యారు. ప్రస్తుతం ముంబై సిటీలోనే బెస్ట్ వెడ్డింగ్ ప్లానర్ గా దూసుకుపోతున్నారు.
పెళ్లికి సెక్యూరిటీ ఇచ్చేది ఎవరో తెలుసా?
విక్కీ కౌశల్-కత్రినాకైఫ్ వివాహం కుటుంబ సభ్యులు..అతికొద్ది మంది సన్నిహితులు..బాలీవుడ్ ప్రముఖుల సమక్షంలో పెళ్లి నిరాడంబరంగా జరుగుతుంది. ఈ పెళ్లికి కత్రినా మాజీ ప్రియుడు సల్మాన్ ఖాన్ తప్పక హాజరవుతారని మీడియా కథనాలు వచ్చినా కానీ ఆఛాన్స్ లేదు. సల్మాన్ కి అహ్వానం అందిందా? లేదా? అన్నది పక్కనబెడితే విక్కీ క్యాట్ పెళ్లికి సల్మాన్ అంతకు మించిన బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ పెళ్లికి సల్మాన్ బాడీ గార్డ్ గా వ్యవహరిస్తున్నారు. సల్మాన్ సెక్యురిటీ సిబ్బంది మొత్తం పెళ్లి రోజున వేదిక వద్ద విధులు నిర్వర్తించనున్నారని తెలుస్తోంది. సల్మాన్ బాడీ గార్డ్ షేరా విక్కీ-క్యాట్ పెళ్లికి అవసరమైన భద్రతా సిబ్బందిని ముంబై నుంచి పంపిస్తున్నారుట. సల్మాన్ అదేశాల మేరకు షేరా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
పెళ్లి రోజు షేరా కత్రినా పక్కనే ఉండాలని ఆదేశాలిచ్చినట్లు సమాచారం. సల్మాన్ టైగర్ సెక్యురిటీ పేరుతో సొంత రక్షణ సిబ్బందిని కల్గి ఉన్నాడు. కొన్నేళ్లగా టైగర్ సెక్యురిటీ సంస్థ సల్మాన్ కి రక్షణ కల్పిస్తుంది. షేరా దానికి నాయకత్వం వహిస్తున్నాడు. షేరా సల్మాన్ కి కట్టప్పలా నమ్మిన బంటు. అందుకే సల్మాన్ పెళ్లికి హాజరు కాకపోయినా కత్రినా కోసం కట్టప్పలాంటి షేరాని పంపిస్తున్నాడు.
మల్లీశ్వరి పెళ్లిలో వెంకీ మామ
కత్రినకు తెలుగు చిత్రసీమలో అగ్రహీరోలతో దోస్తీ ఉంది. అయినా టాలీవుడ్ లో ఎవరినీ ఆహ్వానించడం లేదు. విక్టరీ వెంకటేష్. కత్రినా కైఫ్ అభిమానించే హీరో.. తనకు మాత్రమే ఆహ్వానం అందిందట. కత్రినా టాలీవుడ్ కెరీర్ వెంకటేష్ సినిమాతో నే ప్రారంభమైంది. వెంకటేష్ కథానాయకుడిగా నటించిన `మల్లీశ్వరి` చిత్రంలో కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటించింది. ఆ సినిమా అప్పట్లో పెద్ద హిట్ అయింది.
అప్పటికే బాలవుడ్ లో ఒక సినిమా చేసినా కానీ అది నటిగా కత్రినాకి అంత గుర్తింపును తీసుకురాలేదు. విజయాన్ని ఇవ్వలేదు. మల్లీశ్వరి గా హిట్టయ్యాకే ఇతర అవకాశాలు తనవైపు వచ్చాయి. తన తొలి చిత్ర హీరోని మర్చిపోకుండా కత్రిన పెళ్లికి ఆహ్వానించింది.