కొన్ని సార్లు క్లాసిక్స్ ను ముట్టుకోకుండా ఉండటమే మంచిది. మంచి క్లాసిక్ సినిమాలను రీమేక్ చేయడం లేదా క్లాసిక్ పాటలను రీమిక్స్ చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదు అని అందరికి తెలుసు. అయినా కూడా ఏదో ప్రయత్నించేద్దాం.. పబ్లిసిటీ దక్కించుకుందా అనే ఉద్దేశ్యంతో తప్పులో కాలేస్తూనే ఉంటారు. తాజాగా మరో సారి అదే జరిగింది. మిడ్ నైట్ మసాలా అనగానే 1980 కిడ్స్ కు టిప్ టిప్ బర్సా పానీ పాట గుర్తుకు వస్తుంది. అక్షయ్ కుమార్ మరియు రవీనాల మద్య సాగే ఆ రొమాంటిక్ సాంగ్ ఎంతటి పాపులర్ అయ్యిందో ఇప్పటి యూత్ కు తెలియకున్నా అప్పటి యూత్ కు చాలా బాగా తెలుసు. యూట్యూబ్ లో ఇప్పటికి వందల కొద్ది మిలియన్ వ్యూస్ ను ఆ పాట దక్కించుకుంది అంటే ఏ రేంజ్ లో అందులో రొమాన్స్ కుంభ వృష్టి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. టెలివిజన్ ప్రారంభం అయిన సమయంలో అర్థరాత్రి సమయంలో వచ్చే మిడ్ నైట్ మసాలా అన్ని కార్యక్రమాల్లో కూడా ఖచ్చితంగా ఈ పాట ఉండేది. అంతటి పాపులర్ అయిన సాంగ్ ను రీమిక్స్ చేసి సూర్యవంశీలో పెట్టారు.
ఇటీవలే విడుదల అయిన అక్షయ్ కుమార్ సూర్యవంశీలో ఈ పాట ఉంది. సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినా ఈ పాట విషయంలో మాత్రం ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. ఇప్పటి ప్రేక్షకులకు ఆ పాట యొక్క మజా తెలియదు కనుక పెద్దగా వారి నుండి స్పందన లేదు. కాని అప్పటి వారు మాత్రం పాటను పాడు చేశారు కదరా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆ పాట యొక్క మెయిన్ ఫీల్ ను మొదట చెడగొట్టారు. రీమిక్స్ లో ఏమాత్రం ఓల్డ్ ఫీల్ లేదు అనేది కామెంట్. ఇక లీడ్ పెయిర్ అయిన అక్షయ్ కుమార్ మరియు కత్రీనాలు పాత పాటలో ఉన్నంత రొమాన్స్ ను కురిపించలేక పోయారు అనేది నిజం.
రవీనా ను ఆ పాటలో ఎంత అందంగా చూపించారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏమాత్రం వల్గర్ గా లేకుండా అందంగా చాలా బాగా చూపించారు. కాని కొత్త పాటలో మాత్రం కత్రీనాను ఆ రేంజ్ లో చూపించడంలో మేకర్స్ విఫలం అయ్యారు అనడంలో సందేహం లేదు. ఇలాంటి పాటలను టచ్ చేయకుండా ఉంటేనే బెటర్ అనేది మరోసారి నిరూపితం అయ్యింది. కొత్తగా ప్రయత్నించాలే కాని ఇలాంటి పాటలను రీమిక్స్ చేసే ప్రయత్నం చేస్తే మొదటికే మోసం వస్తుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. టిప్ టిప్ బర్సా పానీ పాత మ్యూజిక్ వింటేనే అప్పట్లో ఒక వైబ్రేషన్ మొదలు అయ్యేది. కాని ఈ పాటలోని మ్యూజిక్ ఆ వైబ్రేషన్ ను కలిగించడం లేదంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Full View